10, ఏప్రిల్ 2021, శనివారం

కర్నూలు జిల్లాలో వికలాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేది ఏప్రిల్‌ 22..



ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం.. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Jobs మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్‌–01, ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌–2–01, ఎంపీహెచ్‌ఏ– 04(స్త్రీలు–02, పురుషులు–02).

ల్యాబ్‌ టెక్నీషియన్‌:
అర్హత: పదోతరగతి తర్వాత మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ కోర్సులో రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌–2:
అర్హత: డీఫార్మసీ/బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

ఎంపీహెచ్‌ఏ:
అర్హత: పదోతరగతి/ఇంటర్మీడియట్‌తోపాటు ఏడాది ఎంపీహెచ్‌ఏ కోర్సు చేసి ఉండాలి.

వయసు: 31.12.2020 నాటికి 18–52 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: వయసు, వైకల్యం, సీనియారిటీ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కలెక్టర్‌ కాంప్లెక్స్, కర్నూలు చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 22.04.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.kurnool.ap.gov.in

కామెంట్‌లు లేవు: