29, ఏప్రిల్ 2021, గురువారం

ఎస్‌బీఐలో 5454 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు.. Closure of registration of application 20/05/2021



ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. క్లరికల్‌ కేడర్‌లో 5454 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsపోస్టులు: జూనియర్‌ అసోసియేట్స్‌(కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌)
మొత్తం పోస్టుల సంఖ్య: 5454 (రెగ్యులర్‌–5000, బ్యాక్‌లాగ్‌– ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ –121, పీడబ్ల్యూడీ–96, ఎక్స్‌సర్వీస్‌మెన్‌–237).

హైదరాబాద్‌ సర్కిల్‌(తెలంగాణ)లో పోస్టుల సంఖ్య: 275.
విద్యార్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్‌/చివరి సెమిస్టర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.04.2021 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 02.04.1993 –01.04.2001 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.

ప్రిలిమినరీ పరీక్ష : ఇది 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు–30 మార్కులకు; న్యూమరికల్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు; రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం ఒక గంట. నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెయిన్‌ ఎగ్జామ్‌కు ఎంపిక చేస్తారు.

మెయిన్‌ ఎగ్జామ్‌: మెయిన్‌ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నల సంఖ్య 190. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు; జనరల్‌ ఇంగ్లిష్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు; క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు; రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 2గంటల 40నిమిషాలు.

ముఖ్య సమాచారం:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.04.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 17.05.2021
ప్రిలిమినరీ పరీక్ష : జూన్‌ 2021లో జరుగుతుంది.
మెయిన్‌ పరీక్ష తేది: 31.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://bank.sbi/careers

State Bank SBI Clerk Recruitment 2021 Apply Online for 5000 Post | Closure of registration of application   20/05/2021 

కామెంట్‌లు లేవు: