22, ఏప్రిల్ 2021, గురువారం

Western Railway Jobs 2021 || రైల్వే లో ఉద్యోగాలు, పరీక్ష లేదు 75,000వరకూ జీతము

 

తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా జగజీవన్ రామ్ వెస్ట్రన్ రైల్వే హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న సుమారు 138 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ కాంట్రాక్టు రైల్వే ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Western Railway Jobs 2021

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదిఏప్రిల్ 6 , 2021
ఇంటర్వ్యూల నిర్వహణ తేదిఏప్రిల్ 8, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

CMP – GDMO14
నర్సింగ్ సూపరింటెండెంట్59
రేడియో గ్రాఫర్2
రానల్ ప్లేస్ మెంట్ /హెమో డైలిసిస్ టెక్నీషియన్1
క్లినికల్ సైకాలజిస్ట్2
హాస్పిటల్ అటెండెంట్60

ఖాళీలు:

మొత్తం 138 ఉద్యోగాలను తాజాగా విడుదలైన ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

విభాగాలను అనుసరించి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యూలేషన్, మరియు  సంబంధిత విభాగాలలో ఎంబీబీఎస్ /పీజీ డిగ్రీ /డిప్లొమా /మాస్టర్ డిగ్రీ /జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ సర్టిఫికెట్ మొదలైన విద్యా అర్హతలు కలిగి ఉండవలెను అని ప్రకటనలో పొందుపరిచారు.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.

మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీసియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

18 నుండి 53 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సదలింపు కలదు.

రైల్వే లో రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు 65 సంవత్సరాలు వరకూ వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

టెలిఫోన్ / వాట్సాప్ ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

విభాగాలను అనుసరించి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 18,000 రూపాయలు నుండి 75,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

ఈ జీతం తో పాటు అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.

Website Link 

Notification

కామెంట్‌లు లేవు: