28, ఏప్రిల్ 2021, బుధవారం

నేవీలో 2500 సెయిల‌ర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది: 30.04.2021

 



భారత నావికా దళం(ఇండియన్‌ నేవీ).. 2500 సెయిలర్‌ పోస్టుల భర్తీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌(ఏఏ)–500, సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌)–2000 ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
Jobs పోస్టులు: సెయిలర్‌
కోర్సు ప్రారంభం: ఆగస్టు 2021
మొత్తం పోస్టుల సంఖ్య: 2500(ఏఏ–500, ఎస్‌ఎస్‌ఆర్‌–2000).

ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌(ఏఏ): 500
అర్హత: ఇంటర్మీడియెట్‌/10+2లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌ చదివి ఉండాలి.
వయసు: 01.02.2001 నుంచి 31.07.2004 మధ్య జన్మించి ఉండాలి.

సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌)–2000
అర్హత: ఇంటర్మీడియెట్‌/10+2లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌ చదివి ఉండాలి.
వయసు: 01.02.2001 నుంచి 31.07.2004 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం..
రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఇంటర్మీడియెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌చేస్తారు. మొత్తం 2500 సెయిలర్‌ పోస్టులకు దాదాపు 10వేల మందిని రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టుకు పిలుస్తారు.

పరీక్ష విధానం..
ప్రశ్న పత్రం హిందీ/ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ప్రశ్న పత్రంలో నాలుగు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్‌ నాలెడ్జ్‌పై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న పత్రం ఇంటర్మీడియెట్‌ స్థాయిలో ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు అదే రోజు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. ఏడు నిమిషాల్లో 1.6 కిలోమీటర్ల పరుగు పూర్తిచేయాలి. అలాగే 20 ఉటక్‌ భైటక్, 10 ఫుష్‌ అప్స్‌చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేది: 30.04.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in/

కామెంట్‌లు లేవు: