తిరుపతి లో ఇంటర్వ్యూలు, పేర్మినెంట్ ఉద్యోగాలు | Tirupati Jobs Latest Update
మల్లాది డ్రగ్స్ & ఫార్మా సూటికల్స్ లో ట్రైనీ పోస్టులకు APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా రేణిగుంట నగరంలో ఉన్న ప్రముఖ మల్లాది డ్రగ్స్ & ఫార్మా సూటికల్స్ లో ఖాళీగా ఉన్న ట్రైనీ ఉద్యోగాల ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC), చిత్తూరు జిల్లా ఒక ప్రకటన ద్వారా తెలిపినది. Tirupati Jobs Latest Update
ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
APSSDC ద్వారా పెర్మనెంట్ పద్దతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.పెర్మనెంట్ గా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల పురుష అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీ స్టేట్ లోని చిత్తూరు జిల్లా రేణిగుంట నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | మార్చి 5 , 2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | ఉదయం 10గంటలకు |
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
SIEMENS సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్, SVU కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, గేట్ నంబర్ -4, SV యూనివర్సిటీ, తిరుపతి, చిత్తూరు జిల్లా – 517501.
విభాగాల వారీగా ఖాళీలు :
ట్రైనీస్ | 20 |
అర్హతలు :
కెమిస్ట్రీ విభాగంలో బీ. ఎస్సీ మరియు ఎం. ఎస్సీ కోర్సులను 2017 -2019 అకాడమిక్ ఇయర్స్ లో పూర్తి చేసిన పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫ్రెషర్స్ మరియు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 25 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 16,667 రూపాయలు చొప్పున సంవత్సరానికి 2 లక్షల వరకూ జీతం లభించనుంది.
అభ్యర్థులకు ఈ జీతంతో పాటు ఇన్సెంటివ్స్, భోజన మరియు వసతి సౌకర్యాలు కూడా కల్పించనున్నారు.
NOTE :
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరు కాబోయే అభ్యర్థులు తమ తమ అప్డేట్ రెస్యూమ్, ఆధార్, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు 10వ తరగతి మరియు 12వ తరగతి, డిగ్రీ మార్క్స్ షీట్స్ ను తమ వెంట తీసుకుని వెళ్లాలని ప్రకటనలో పొందుపరిచారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
88860 86072
1800-425-2422
కామెంట్‌లు