28, ఏప్రిల్ 2021, బుధవారం

AP Mineral Development Corporation || 1 లక్ష రూపాయిలు జీతం ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ప్రభుత్వ ఉద్యోగాలు

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.  

కేవలం ఈ మెయిల్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చును అనీ ఈ ప్రకటనలో పొందుపరిచారు.

AP Mineral Development Corporation

ముఖ్యమైన తేదీలు :

ఈమెయిల్ దరఖాస్తుకు చివరి తేదిమే 22, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

జనరల్ మేనేజర్ (మార్కెటింగ్ )1
జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ )1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఎన్విరాన్మెంటల్ )1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (కాంట్రాక్టు మేనేజ్మెంట్ )1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (F&A /టాక్సషన్ )1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (CSR)1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్ )1
మేనేజర్ (సర్వే /GIS)1
మేనేజర్ (ఫైనాన్స్ )4
మేనేజర్ (కాంట్రాక్టు అడ్మిన్ )1
మేనేజర్ (ఐటీ )1
మేనేజర్ (మైనింగ్ )3
మేనేజర్ (కంపెనీ సెక్రటరీ )1
AP Mineral Development Corporation

అర్హతలు :

సంబంధిత విభాగాల ఉద్యోగాలను అనుసరించి డిప్లొమా (సివిల్ /మైనింగ్ )/బీ. టెక్ (ఐటీ )/ మైనింగ్ ఇంజనీరింగ్/ బీ. కామ్/సీఏ /ఎంబీఏ (మార్కెటింగ్ /ఫైనాన్స్ )/ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చును.

ఈ ఉద్యోగాల విద్యా అర్హతలకు సంబందించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీషియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 60 సంవత్సరాలకు మించరాదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ ఈమెయిల్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.


జీతం :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు  60,000 రూపాయలు నుండి 1,00,000 రూపాయలు పైన జీతముగా లభించనుంది.

ఈమెయిల్ అడ్రస్ :

apmdchrdrecruitments@gmail.com

Website 

Notification

 

కామెంట్‌లు లేవు: