ఆర్‌బీఐలో 841 ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు నోటిఫికేషన్.. చివరి తేది మార్చి 15
పదోతరగతి పూర్తయిన యువతకు సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది దేశ అత్యున్నత బ్యాంకు..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ). ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఆర్‌బీఐ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 841 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది. పదోతరగతి పాసైన వారు ఈ ఉద్యోగాల దరఖాస్తుకు అర్హులు. ఈ సందర్భంగా ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 841 అర్హతలు: పదోతరగతి (ఎస్‌ఎస్‌సీ/మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 01/02/2021 నాటికి అండర్ గ్రాడ్యుయేట్‌గా ఉండాలి. గ్రాడ్యుయేట్లు, ఉన్నత విద్యార్హతలు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. వయసు: 01.02.2021 నాటికి 18–25 ఏళ్ల మధ్య ఉండాలి. 02.02.1996 – 01.02.2003 మధ్య జన్మించినవారై ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ...