26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

TTD News

తిరుమల‌: మార్చి నెల‌కు సంబంధించిన తిరుమ‌ల
■ శ్రీ‌వారి కల్యాణోత్సవం,
■ ఊంజ‌ల్‌సేవ‌,
■ ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం,
■ సహస్ర దీపాలంకార‌ సేవల ఆన్‌లైన్ (వ‌ర్చువ‌ల్‌) టికెట్ల కోటాను

★★  గురువారం ఉద‌యం 11 గంట‌ల‌కు టిటిడి విడుదల చేసింది. ఈ సేవా టికెట్లు పొందిన భ‌క్తులు ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా త‌మ ఇళ్ల నుండే వ‌ర్చువ‌ల్ విధానంలో ఈ సేవ‌ల్లో పాల్గొనాల్సి ఉంటుంది.

■ భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ముంద‌స్తుగా ఈ సేవ‌ల‌ టికెట్ల‌ను బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది. కాగా, కల్యాణోత్సవం టికెట్లు పొందిన‌ గృహస్తుల‌కు(ఇద్దరికి) ఆ టికెట్‌పై ఉచితంగా ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. అయితే, క‌ల్యాణోత్స‌వం టికెట్‌ పొందిన భ‌క్తులు మార్చి 31లోపు త‌మ‌కు సౌక‌ర్య‌వంత‌మైన తేదీనాడు రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రుసుము చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.

 అదేవిధంగా, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, సహస్ర దీపాలంకార‌ సేవల ఆన్‌లైన్ టికెట్లు పొందిన భ‌క్తులు మార్చి 31లోపు త‌మ‌కు సౌక‌ర్య‌వంత‌మైన తేదీనాడు రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్‌ను ఆన్‌లైన్ ద్వారా రుసుము చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
 *Dept.Of PRO TTD.*


కామెంట్‌లు లేవు: