28, ఫిబ్రవరి 2021, ఆదివారం

డీఆర్‌డీఓ–ఏఆర్‌డీఈలో 11 జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు.. చివరి తేది ఏప్రిల్‌ 15


భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్‌డీఓ–ఆర్మమెంట్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏఆర్‌డీఈ).. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.Jobs 
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: ఎలక్ట్రానిక్స్‌/ఈ–టీసీ/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్, మెకానికల్, మెట్లర్జికల్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/గేట్‌ అర్హత ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఇంటర్వ్యూ/రాత పరీక్ష తేది: 27.05.2021

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఆర్మమెంట్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్, ఆర్మమెంట్‌ పోస్ట్, పాశన్, పూణె–411021 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 15, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.drdo.gov.in

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

కామెంట్‌లు లేవు: