ప్రసార భారతిలో ఉద్యోగాలు
ఇతర వివరాలు: ప్రసార భారతికి చెందిన ఆల్ ఇండియా రేడియో-AIR ఉద్యోగాల
భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని యూనిట్‌లో వెబ్
ఎడిటర్లను నియమిస్తోంది. క్యాజువల్ అసైన్‌మెంట్ పద్ధతిలో ఈ పోస్టుల్ని
భర్తీ చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-GHMC పరిధిలో
నివసించేవారి నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఖాళీల వివరాలను
ప్రకటించలేదు. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి గల
అభ్యర్థులు 2021 మార్చి 1 సాయంత్రం 5 గంటల్లో అప్లై చేయాలి. ఈ
నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను newsonair.com/
వెబ్‌సైట్‌లో Vacancies సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో
దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి,
చివరి తేదీలోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టులో పంపాలి.
విద్యార్హతల వివరాలు చూస్తే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాస్ కావాలి.
జర్నలిజంలో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం ఉండాలి.
జర్నలిజంలో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం
లేనివారికి ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టింగ్ లేదా ఎడిటింగ్
వర్క్‌లో 5 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. జీహెచ్ఎంసీ పరిధిలో
నివసిస్తున్నవారే దరఖాస్తు చేయాలి. గ్రాఫిక్ డిజైనింగ్‌తో పాటు కంప్యూటర్
అప్లికేషన్స్ తెలిసుండాలి. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 50 ఏళ్ల లోపు ఉండాలి.
దరఖాస్తు ఫీజు వివరాలు చూస్తే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ,
ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు రూ.225. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
చేస్తారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా newsonair.com/
వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. Vacancies సెక్షన్‌లో వెబ్ ఎడిటర్ నోటిఫికేషన్
ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు, ఇతర వివరాలు
తెలుసుకోవాలి. నోటిఫికేషన్‌లోనే దరఖాస్తు ఫామ్ ఉంటుంది. దరఖాస్తు ఫామ్
పూర్తి చేసి, డాక్యుమెంట్స్ జతచేసి 2021 మార్చి 1 సాయంత్రం 5 గంటల్లోగా
వెబ్ సైట్ లోని అడ్రస్‌కు పోస్టులో పంపాలి.
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
కామెంట్‌లు