📚✍ఒకటి నుంచి ఏడో తరగతి దాకా సీబీఎస్‌ఈ✍📚

♦వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు

♦2024 నాటికి పదో తరగతి వరకూ: సీఎం

🌻ఈనాడు, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి 7వ తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను బోధించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. 2024 నాటికి 8, 9, 10 తరగతులకూ వర్తింపజేయాలని, జగనన్న విద్యా కానుకలో ఆంగ్లం-తెలుగు నిఘంటువును చేర్చాలని సూచించారు.
దానిని ఉపాధ్యాయులకూ ఇవ్వాలని ఆదేశించారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చే పుస్తకాల నాణ్యతతో పోటీ పడాలని పేర్కొన్నారు. ‘నాడు-నేడు’పై  తాడేపల్లిలోని  క్యాంపు  కార్యాలయంలో బుధవారం సీఎం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పక్కా భవనాలు లేని 390 పాఠశాలలకు వెంటనే భవనాలు నిర్మించాలని ఆదేశించారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతకు 27 వేల మంది ఆయాల్ని నియమించామని, మార్చి మొదటి వారంలో వీరందరికీ శిక్షణ ఇస్తామని అధికారులు సీఎంతో చెప్పారు. నాడు-నేడు తొలిదశ పనుల్ని మార్చిఆఖరుకు పూర్తి చేయాలని, పాఠశాలలు రంగులతో ఆకర్షణీయంగా ఉండాలని జగన్‌ ఆదేశించారు. రెండోదశలో మరిన్ని మార్పులు చేయాలని, విద్యార్థుల బల్లలు సౌకర్యవంతంగా ఉండాలని పేర్కొన్నారు.

♦సీఎం ఇంకా ఏమన్నారంటే..

* నాడు-నేడు పనుల్లో నాణ్యత కొరవడితే తీవ్రంగా పరిగణించాలి.

* చిన్నారులకు ఎలా బోధించాలనే అంశంపై అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలి. ఉపాధ్యాయులకూ శిక్షణ కొనసాగించాలి. వారు ఎంత నేర్చుకున్నారనే దానిపై రెండు నెలలకోసారి ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాలి. వాటిలో ఉత్తీర్ణులయ్యారా? లేదా? అనేదానితో సంబంధం లేకుండా శిక్షణ ద్వారా వారు ఎంత మెరుగయ్యారో పరిశీలించాలి.

* అమ్మఒడి పథకానికి బదులుగా ల్యాప్‌టాప్‌ను కోరుకున్న వారికి ఇచ్చేవి నాణ్యతతో ఉండాలి.

✍1 నుంచి 7వ తరగతి
 వరకు సీబీఎస్‌ఈ✍📚



♦‘నాడు-నేడు’  సమీక్షలో సీఎం జగన్‌

♦పనులు మార్చి చివరికి పూర్తవ్వాలి.. మొదటిదశ ‘నాడు-నేడు’కిదే డెడ్‌లైన్‌

♦పనుల నాణ్యతలో రాజీపడొద్దు.. ‘విద్యా కానుక’ కిట్‌లో ఇంగ్లీషు డిక్షనరీ

♦ఆయాలు, అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ.. 390 స్కూళ్లకు పక్కా భవనాలు


🌻అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): మొదటి దశ ‘నాడు-నేడు’ పనులు మార్చి నెలాఖ రు కల్లా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎ్‌సజగన్‌ అధికారులను ఆదేశించారు. స్కూళ్లు కలర్‌ఫుల్‌గా, మంచి డిజైన్లతో ఉండాలనీ, ఇంటీరియర్‌ కూడా బాగుండాలనీ సూచించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘నాడు-నేడు’ పనులపై విద్యాశాఖ అధికారుల తో ముఖ్యమంత్రి సమీక్షించారు. ‘నాడు-నేడు’ కింద మౌలిక సదుపాయాలను మార్చిన స్కూళ్ల ఫొటోలను పరిశీలించారు.  రెండోదశ ‘నాడు-నేడు’ పనులను జగన్‌ సమీక్షిస్తూ.. వి ద్యార్థులకు ఏర్పాటు చేసే బెంచ్‌లు సౌకర్యవంతంగా ఉండాలనీ, ఎత్తు కూడా చూసుకోవాలనీ స్పష్టం చేశారు. పనుల్లో ఎక్కడా నాణ్యతా లో పం రాకూడదని ఆదేశాలు జారీచేశారు. ప్రభు త్వ పాఠశాలలకు పక్కా భవనాలు లేని పరిస్థి తి ఎక్కడా ఉండకూడదనీ, ఎక్కడైతే భవనాలు లేవో అక్కడ ఖచ్చితంగా నిర్మించాలన్నారు. ప క్కా భవనాలు లేని 390 పాఠశాలలకు వాటి నిర్మాణానికి సీఎం ఆదేశాలిచ్చారు. ‘విద్యా కానుక’ కిట్‌లో ఈసారి ఇంగ్లీషు- తెలుగు డిక్షన రీ తప్పనిసరిగా చేర్చాలని సీఎం ఆదేశించారు. ప్రైవేట్‌ స్కూళ్లలో ఇస్తున్న పుస్తకాల నాణ్యతతో పోటీగా ప్రభుత్వం ఇచ్చే పాఠ్యపుస్తకాలు ఉం డాలన్నారు. ‘విద్యా కానుక’లో ఏది చూసినా కూడా క్వాలిటీ ఉండాలని, ఎక్కడా రాజీ పడొద్ద ని సీఎం స్పష్టం చేశారు.

🌻టీచర్లకూ డిక్షనరీలు ఇవ్వాలనీ, ‘అమ్మ ఒడి’ కింద ఆప్షన్‌ తీసుకున్న విద్యార్థులకు ఇచ్చే లాప్‌టా్‌పల క్వాలిటీ, సర్వీస్‌ ముఖ్యమని తెలిపారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతపై సీఎం సమీక్షించారు. ఇప్పటికే 27 వేల మంది ఆయాలను నియమించినట్లు అధికారులు తెలిపారు. మార్చి మొదటి వారం లో వీరందరికీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పరిపరాలు శుభ్రంగా ఉంచే లిక్విడ్లను అన్నీ స్కూళ్లకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు సీఎంకు వివరించారు. విద్యార్థుల హాజరుకు సంబంధించి తల్లులు, ఎడ్యుకేషన్‌ సెక్రెటరీలు, వలంటీర్ల మ్యాపింగ్‌ ప్రక్రియ నడుస్తోందని అధికారులు చెప్పగా.. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. మార్చి 15కల్లా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 7వ తరగతి వరకూ సీబీఎ్‌స ఈ విధానం అమలు చేయాలని, ఆ తర్వాత నుంచి ఒక్కో తరగతి పెంచుకొంటూ 2024 విద్యా సంవత్సరానికల్లా 1 నుంచి 10 తరగతి వరకు విద్యార్థులు ఈ విధానంలోకి రావాలన్నా రు. ఈ మేరకు అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇ వ్వాలనీ, చిన్నారులకు బోధన ఎలా చేయాలన్నదానిపై ఈ శిక్షణ ఉండాలన్నారు. ప్రతి రెండు నెలలకోసారి ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాలని  చెప్పారు. పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యారా? లేదా ? అన్నదానితో సంబంధం లేకుండా వారు ఎం తవరకు శిక్షణ కార్యక్రమాల ద్వారా అప్‌గ్రేడ్‌ అయ్యారో పరిశీలించాలన్నారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

శ్రీ సత్యసాయి జిల్లా, మిషన్ వాత్సల్య పథకం కింద చిల్డ్రన్స్ హోమ్, ధర్మవరం మరియు హిందూపూర్ రిక్రూట్‌మెంట్. Recruitment of Children Home, Dharmavaram and Hindupur Under Mission Vatsalya Scheme, Sri Sathya Sai Dist.

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)