RRB Technician: రైల్వే శాఖలో 14,298 టెక్నీషియన్ పోస్టులు
RRB Technician: రైల్వే శాఖలో 14,298 టెక్నీషియన్ పోస్టులు ఉద్యోగార్థులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. వివిధ రైల్వే జోన్లలో టెక్నీషియన్ కొలువులకు గత మార్చిలో ఆర్‌ఆర్‌బీ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో 9,144 ఖాళీలు పేర్కొనగా.. దీన్ని భారీగా పెంచుతున్నట్లు రైల్వే శాఖ ఆగస్టు 22న అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అవసరాల దృష్ట్యా 40 కేటగిరీల్లో మొత్తం 14,298 టెక్నీషియన్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మేరకు జోన్ల వారీగా ఖాళీల వివరాలు వెల్లడయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో 959 ఖాళీలున్నాయి. అత్యధికంగా చెన్నై జోన్‌లో 2716; అత్యల్పంగా సిలిగురి జోన్‌లో 91 ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు మళ్లీ అవకాశం కల్పించనున్నట్లు ఆర్‌ఆర్‌బీ స్పష్టం చేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తును సరిదిద్దడంతో పాటు పోస్టుల ప్రాధామ్యాలు ఇచ్చుకోవచ్చని రైల్వే శాఖ తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ...