నేటి వార్తలు 17-09-2024
*♻️నేటి వార్తలు (17.09.2024)*
*✳️నేటి ప్రత్యేకత:*
▪️ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం
▪️తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం
▪️విశ్వకర్మ జయంతి
*✳️అంతర్జాతీయ వార్తలు::*
▪️నైరుతి లెబనాన్ లోని ధమర్ ప్రావిన్స్ లో అమెరికా తయారీ ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ ను కూల్చి వేసినట్లు యెమెన్ లోని హూతీ తిరుగుబాటుదారులు నిన్న ప్రకటించారు.
▪️పపువా న్యూ గినీ లో ఓ బంగారు గని కోసం రెండు వర్గాల మధ్య జరిగిన వివాదంలో 20 - 50 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి అధికారులు నిన్న తెలియజేశారు.
▪️మధ్య ఐరోపా దేశాలైన పోలాండ్, చెక్ రిపబ్లిక్, రోమేనియా, ఆస్ట్రియా దేశాలలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలదిగ్బంధం కాగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
▪️గాజా ప్రాంతంలోని నసీరత్ శరణార్థి సమీపం లో ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో 16 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా 13 మంది గాయపడ్డారు.
▪️75 ఏళ్లలో తొలిసారిగా చైనా ఆర్థిక నగరం షాంఘై ను అత్యంత బలమైన బెబింకా టైఫూన్ సెకనుకు 42 మీటర్ల వేగంతో తాకడంతో ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది.
▪️ఉన్నత విద్య కోసం వెళ్లే విదేశీ విద్యార్థులు తమ నెలవారీ ఖర్చుల నిమిత్తం నెలకు కనీసం రూ.1.64 లక్షల రూపాయలు తమ ఖాతాలో కలిగి ఉండాలని బ్రిటన్ ప్రభుత్వ నిబంధనలు సవరించింది.
*✳️జాతీయ వార్తలు:*
▪️గుజరాత్ లోని గాంధీ నగర్ లో నాలుగవ ప్రపంచ పునరుత్పాదక ఇందన పెట్టుబడుల సమావేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ప్రారంభించారు. అనంతరం అహ్మదాబాద్ గాంధీనగర్ మెట్రో రైలు రెండవ దశను ఆయన ప్రారంభించారు.
▪️పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నెలరోజులకు పైగా ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తో నిన్న రాత్రి నిర్వహించిన చర్చలు ముగిసాయి.
▪️కేరళలోని పెరింతల్ మన్న లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 23 ఏళ్ల వ్యక్తి నిఫా వైరస్ తో మృతి చెందడంతో పరిసర ప్రాంతాలలో నిఫా వైరస్ ప్రోటోకాల్ నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
▪️జైలు నుంచి విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ( ఆఫ్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ నేడు తన పదవికి రాజీనామా చేయనున్నారు.
▪️దేశంలోని 23 ఐఐటీలలో అమ్మాయిల చేరికల శాతం గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగినట్లు ఐఐటీ మద్రాసు విడుదల చేసిన 2024" పై జాయింట్ ఇంప్లిమెంటేషన్ కమిటీ నివేదిక తెలియజేసింది.
▪️దేశంలో మహిళా భద్రతపై ప్రజా చైతన్యం పెంచాల్సిన అవసరం ఉందని "సీఎన్ఎన్ న్యూస్ 18 - షీ శక్తి-2024" సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది మర వీడియో సందేశం ద్వారా తెలియజేశారు.
✳️ *రాష్ట్ర వార్తలు:*
▪️ఏపీ సమీకృతశుద్ధ ఇంధన (ఐఇసి) విధానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 2030 నాటికి పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని 72.60 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుజరాత్ లోని గాంధీ నగర్ లో నిన్న ప్రారంభమైన నాలుగవ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు.
▪️రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సర్ల నియామకం కోసం విద్యారంగ నిపుణుల నుంచి ఈనెల 28వ తేదీలోగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు.
▪️రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలలలో 2024 25 సంవత్సరానికి యాజమాన్య కోట (బి, సి) కేటగిరి ఎంబిబిఎస్ సీట్లకు ఐచికాల ఎంపిక నోటిఫికేషన్ను విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిన్న విడుదల చేసింది.
▪️ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశాన్ని ఈనెల 18వ తేదీన మంగళగిరిలోని సి కె కన్వెన్షన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన నిర్వహించనున్నారు.
▪️విశాఖపట్నం - రాయపూర్ (దుర్గ్) మధ్య నడిచే నూతన వందే భారత్ రైలును నిన్న విశాఖపట్నంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.
✳️ *క్రీడావార్తలు: .*
▪️హంగేరి రాజధాని బుడాపెస్ట్ లో జరుగుతున్న చెస్ ఒలింపియన్ లో నిన్న ఆరవ రౌండ్ లో భారత పురుషుల, మహిళల జట్లు వరుసగా 6వ విజయాన్ని నమోదు చేశాయి.
▪️కోల్కతాలో ఇండియన్ సూపర్ లీగ్ ఐఎస్ఎల్ లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు మహమ్మద్ ఎస్ సీ జట్టుపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
▪️చైనాలోని హలున్ బుయిర్ లో జరుగుతున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ లో భాగంగా నిన్న జరిగిన సెమీఫైనల్స్ లో భారత జట్టు 4-1 గోల్స్ తేడాతో దక్షిణ కొరియా ను ఓడించి ఫైనల్స్ లో ప్రవేశించింది.
▪️భారత యువ రెజ్లర్ల కోసం కోసం సాక్షి మాలిక్, గీత ఫోగాట్, అమన్ సెహ్రావత్ లు కలిసి నూతన లీగ్ ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు నిన్న వెల్లడించారు.
కామెంట్‌లు