RRB Technician: రైల్వే శాఖలో 14,298 టెక్నీషియన్ పోస్టులు
RRB Technician: రైల్వే శాఖలో 14,298 టెక్నీషియన్ పోస్టులు
ఉద్యోగార్థులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. వివిధ రైల్వే జోన్లలో
టెక్నీషియన్ కొలువులకు గత మార్చిలో ఆర్ఆర్బీ ప్రకటన జారీ చేసిన విషయం
తెలిసిందే. ఈ నోటిఫికేషన్లో 9,144 ఖాళీలు పేర్కొనగా.. దీన్ని భారీగా
పెంచుతున్నట్లు రైల్వే శాఖ ఆగస్టు 22న అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అవసరాల దృష్ట్యా 40 కేటగిరీల్లో
మొత్తం 14,298 టెక్నీషియన్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మేరకు జోన్ల
వారీగా ఖాళీల వివరాలు వెల్లడయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే జోన్లో 959
ఖాళీలున్నాయి. అత్యధికంగా చెన్నై జోన్లో 2716; అత్యల్పంగా సిలిగురి
జోన్లో 91 ఖాళీలు ఉన్నాయి.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మళ్లీ అవకాశం కల్పించనున్నట్లు ఆర్ఆర్బీ స్పష్టం చేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తును సరిదిద్దడంతో పాటు పోస్టుల ప్రాధామ్యాలు ఇచ్చుకోవచ్చని రైల్వే శాఖ తెలిపింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 ప్రారంభ వేతనం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలో రాత పరీక్షలు నిర్వహిస్తారు.
ప్రకటన వివరాలు:
1. టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్(ఓపెన్ లైన్): 1,092 పోస్టులు
2. టెక్నీషియన్ గ్రేడ్-III(ఓపెన్ లైన్): 8,052 పోస్టులు
3. టెక్నీషియన్ గ్రేడ్-III(వర్క్‌షాప్ అండ్ పీయూఎస్): 5,154 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 14,298. (యూఆర్- 6171, ఎస్సీ- 2014, ఎస్టీ- 1152, ఓబీసీ- 3469, ఈడబ్ల్యూఎస్- 1481)
ఆర్ఆర్బీ రీజియన్ వారీగా ఖాళీలు:
1. ఆర్ఆర్బీ అహ్మదాబాద్- 1015
2. ఆర్ఆర్బీ అజ్మేర్- 900
3. ఆర్ఆర్బీ బెంగళూరు- 337
4. ఆర్ఆర్బీ భోపాల్- 534
5. ఆర్ఆర్బీ భువనేశ్వర్- 166
6. ఆర్ఆర్బీ బిలాస్పూర్- 933
7. ఆర్ఆర్బీ చండీగఢ్- 187
8. ఆర్ఆర్బీ చెన్నై- 2716
9. ఆర్ఆర్బీ గువాహటి- 764
10. ఆర్ఆర్బీ జమ్ము అండ్ శ్రీనగర్- 721
11. ఆర్ఆర్బీ కోల్‌కతా- 1098
12. ఆర్ఆర్బీ మాల్దా- 275
13. ఆర్ఆర్బీ ముంబయి- 1883
14. ఆర్ఆర్బీ ముజఫర్‌పూర్- 113
15. ఆర్ఆర్బీ పట్నా- 221
16. ఆర్ఆర్బీ ప్రయాగ్‌రాజ్- 338
17. ఆర్ఆర్బీ రాంచీ- 350
18. ఆర్ఆర్బీ సికింద్రాబాద్- 959
19. ఆర్ఆర్బీ సిలిగురి- 91
20. ఆర్ఆర్బీ తిరువనంతపురం- 278
21. ఆర్ఆర్బీ గోరఖ్‌పూర్- 419
అర్హతలు:
*
టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: బీఎస్సీ, బీఈ/ బీటెక్, డిప్లొమా (ఫిజిక్స్/
ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఇన్స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణలై
ఉండాలి.
* టెక్నీషియన్ గ్రేడ్-III:
మెట్రిక్యులేషన్/ ఎస్ఎస్ఎల్సీ, ఐటీఐ (ఎలక్ట్రీషియన్/ వైర్‌మ్యాన్/
ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్/ మెకానిక్/
ఫిట్టర్/ వెల్డర్/ పెయింటర్ జనరల్/ మెషినిస్ట్/ కార్పెంటర్/ ఆపరేటర్
అడ్వాన్స్డ్ మెషిన్ టూల్/ మెషినిస్ట్/ మెకానిక్ మెకానిక్/ మెకానిక్
మెకాట్రానిక్స్/ మెకానిక్ డీజిల్/ మెకానిక్ (మోటార్ వెహికిల్)/ టర్నర్/
ఆపరేటర్ అడ్వాన్స్డ్ మెషిన్ టూల్/ గ్యాస్ కట్టర్/ హీట్ ట్రీటర్/
ఫౌండ్రీమ్యాన్/ ప్యాటర్న్ మేకర్/ మౌల్డర్ తదితరాలు). లేదా 10+2 (ఫిజిక్స్,
మ్యాథ్స్) ఉత్తీర్ణలై ఉండాలి.
వయోపరిమితి: 01-07-2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-I
సిగ్నల్ పోస్టులకు 18-36 ఏళ్లు; టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 18-33
ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు,
దివ్యాంగులకు 10- 15 ఏళ్ల సడలింపు ఉంది.
ప్రారంభ వేతనం: నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రశ్నపత్రం: టెక్నీషియన్
గ్రేడ్-I సిగ్నల్ ప్రశ్నపత్రంలో జనరల్ అవేర్నెస్ (10 ప్రశ్నలు, 10
మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (15 ప్రశ్నలు, 15
మార్కులు), బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ (20 ప్రశ్నలు,
20 మార్కులు), మ్యాథమెటిక్స్ (20 ప్రశ్నలు, 20 మార్కులు), బేసిక్
సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (35 ప్రశ్నలు, 35 మార్కులు) అంశాలపై ప్రశ్నలు
వస్తాయి. టెక్నీషియన్ గ్రేడ్-III ప్రశ్నపత్రంలో మ్యాథమెటిక్స్ (25
ప్రశ్నలు, 25 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (25
ప్రశ్నలు, 25 మార్కులు), జనరల్ సైన్స్ (40 ప్రశ్నలు, 40 మార్కులు),
జనరల్ అవేర్నెస్ (10 ప్రశ్నలు, 10 మార్కులు) అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. మొత్తం మార్కులు 100.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 02-10-2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16-10-2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 17.10.2024 నుంచి 21.10.2024 వరకు.
ముఖ్యాంశాలు...
* 14,298 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
* అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
* కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
* దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలో రాత పరీక్షలు నిర్వహిస్తారు.
https://rrbsecunderabad.gov.in/
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్లు