రైల్వేలో డిగ్రీ తో ఉద్యోగాలు Jobs with Degree in Railways | సన్నద్ధత ఎలా? | సిలబస్ | ఎంపిక | పరీక్ష తేదీలు | ఫీజు | విద్యార్హత | వయసు | ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్-1736, స్టేషన్ మాస్టర్-994,
గూడ్స్ ట్రెయిన్ మేనేజర్-3144, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్
టైపిస్ట్-1507, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్-732 పోస్టులు ఉన్నాయి.
వీటిలో మొదటి రెండు లెవెల్-6 ఉద్యోగాలు. రూ.35,400 ప్రారంభ మూల వేతనం
దక్కుతుంది. డీఏ, హెచ్ఆర్ఏ, మిగతా అలవెన్సులతో మొదటి నెల నుంచే కనీసం
రూ.65 వేల వేతనం అందుకోవచ్చు. మిగిలినవన్నీ లెవెల్-5 కొలువులు. రూ.29,200
మూల వేతనం చెల్లిస్తారు. అన్నీ కలిపి సుమారు రూ.55 వేల జీతం పొందుతారు.
విద్యార్హత: ఏదైనా డిగ్రీ.
వయసు: 01.01.2025 నాటికి 18 - 36 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో మినహాయింపు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 13
ఫీజు: మహిళలు,
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, ట్రాన్స్జెండర్లు,
మైనార్టీలు, ఈబీసీలకు రూ.250. వీరు స్టేజ్-1కు హాజరైతే పన్నులు
మినహాయించుకుని ఫీజు తిరిగి చెల్లిస్తారు. మిగిలినవారు రూ.500
చెల్లించాలి.
వీరు పరీక్ష రాస్తే రూ.400లో పన్నులు మినహాయించుకుని, మిగిలింది వెనక్కి ఇస్తారు.
పరీక్ష తేదీలు: తర్వాత ప్రకటిస్తారు.
ఎంపిక
అన్ని పోస్టులకూ రెండు దశల్లో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్టు
(సీబీటీ)లో ప్రావీణ్యం తప్పనిసరి. స్టేషన్ మాస్టర్ పోస్టుకు కంప్యూటర్
బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్టు (సీబీఏటీ) అదనంగా రాయాలి. టైపిస్ట్ పోస్టులకు
టైపింగ్ స్కిల్ టెస్టు (టీఎస్టీ) నిర్వహిస్తారు. ఆ తర్వాత ధ్రువపత్రాల
పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించి ఉద్యోగంలోకి తీసుకుంటారు.
స్టేజ్-1: వంద
ప్రశ్నలు. వీటికి 90 నిమిషాలు. జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ 30,
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 ప్రశ్నలు వస్తాయి.
స్టేజ్-2:
స్టేజ్-1లో అర్హత పొందినవారి నుంచి, కేటగిరీల వారీ ఉన్న ఖాళీలకు మెరిట్
ప్రకారం 15 రెట్ల మందిని స్టేజ్-2కు అవకాశమిస్తారు. దీన్ని 120 మార్కులకు
నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.
జనరల్ అవేర్నెస్ 50, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్
రీజనింగ్ 35 ప్రశ్నలు వస్తాయి.
అర్హతకు: స్టేజ్-1,
స్టేజ్-2లలో అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యుఎస్ 40, ఓబీసీ ఎన్సీఎల్, ఎస్సీ
30, ఎస్టీ 25 శాతం మార్కులు పొందాలి. పీడబ్ల్యుడీలైతే వారి కేటగిరీ ప్రకారం
అదనంగా మరో 2 శాతం మినహాయింపు దక్కుతుంది. రెండు దశల్లోనూ ప్రతి తప్పు
సమాధానానికీ 1/3 మార్కు తగ్గిస్తారు. స్టేషన్ మాస్టర్, టైపిస్ట్
పోస్టులకు పోటీ పడేవారికి.. స్టేజ్-2లో అర్హుల జాబితా నుంచి మెరిట్
ప్రకారం కేటగిరీల వారీ ఖాళీలకు 8 రెట్ల సంఖ్యలో కంప్యూటర్ బేస్డ్
ఆప్టిట్యూడ్ టెస్టు/ టైపింగ్ స్కిల్ టెస్టు నిర్వహిస్తారు. స్టేషన్
మాస్టర్ ఎంపికలో స్టేజ్-2 పరీక్ష స్కోరుకు 70 శాతం, సీబీఏటీకు 30 శాతం
వెయిటేజీ ఉంటుంది. టైపిస్ట్ పోస్టులకు నిర్వహించే టీఎస్టీలో అర్హత
సాధిస్తే సరిపోతుంది.
సిలబస్
మ్యాథమెటిక్స్: నంబర్
సిస్టం, డెసిమల్స్, భిన్నాలు, కసాగు, గసాభా, రేషియో అండ్ ప్రపోర్షన్,
శాతాలు, మెన్సురేషన్, కాలం-పని, కాలం-దూరం, బారు, చక్ర వడ్డీలు, లాభ
నష్టాలు, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, చలనజ్యామితి, త్రికోణమితి, ప్రాథమిక
సాంఖ్యకశాస్త్రం.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: అనాలజీలు,
నంబర్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్,
మ్యాథమెటికల్ ఆపరేషన్స్, పోలికలు-భేదాలు, సంబంధాలు, అనలిటికల్ రీజనింగ్,
సిలాజిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, పజిల్, డేటా సఫిషియన్సీ,
స్టేట్మెంట్-కన్‌క్లూజన్, స్టేట్మెంట్-కోర్సెస్ ఆఫ్ యాక్షన్,
డెసిషన్ మేకింగ్, మ్యాప్‌లు, ఇంటర్‌ప్రెటేషన్ ఆఫ్ గ్రాఫ్స్.
జనరల్ అవేర్నెస్:
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యం సంతరించుకున్న తాజా సంఘటనలు,
క్రీడలు, భారతీయ కళలు, సంస్కృతి, సాహిత్యం, చరిత్రక, దర్శనీయ స్థలాలు, పదో
తరగతి స్థాయిలో జనరల్ సైన్స్, లైఫ్ సైన్స్, భారతదేశ చరిత్ర,
స్వాతంత్య్రోద్యమం, భారతదేశ, ప్రపంచ జాగ్రఫీ, భారత ప్రభుత్వం, రాజ్యాంగం,
రాజకీయ వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్, ప్రపంచవ్యాప్తంగా
జరుగుతోన్న అభివృద్ధి, స్పేస్, న్యూక్లియర్ కార్యక్రమాలు, జాతీయ,
అంతర్జాతీయ స్థాయి పర్యావరణ సమస్యలు, కంప్యూటర్లు, వాటి అనువర్తనాలకు
సంబంధించి ప్రాథమికాంశాలు, అబ్రివియేషన్లు, దేశ రవాణా వ్యవస్థ, దేశ ఎకానమీ,
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులు, ప్రభుత్వ ముఖ్య కార్యక్రమాలు, మన
భూభాగంలోని వృక్షాలు, జంతువులు, దేశంలో ముఖ్యమైన ప్రభుత్వ, పబ్లిక్
సెక్టార్ సంస్థలు.. ఇవన్నీ బాగా చదవాలి.
సన్నద్ధత ఎలా?
*ఎక్కువమంది
అభ్యర్థులు చేసే ప్రధాన పొరపాటు- సిలబస్ వివరాలు శ్రద్ధగా పరిశీలించకుండా
ఏదో ఒక పుస్తకం/మెటీరియల్ చదువుకుంటూ అధ్యయనం కొనసాగించడం. దీంతో
సన్నద్ధత, సిలబస్ మధ్య పొంతన కుదరదు. ఇలా కాకుండా ముందుగా నోటిఫికేషన్లో
విభాగాల వారీ ఉన్న ప్రశ్నాంశాలు (సిలబస్) బాగా పరిశీలించాలి. మీ దగ్గర
ఉన్న వనరులు (గైడ్లు, అకడెమిక్, రిఫరెన్స్ పుస్తకాలు, స్టడీ మెటీరియల్)
నుంచి ఆ అంశాలనే బాగా అధ్యయనం చేయాలి. వాటిలో లేనివి.. అంతర్జాలం, ఇతర
చోట్ల నుంచి సేకరించి బాగా చదవాలి. సిలబస్‌పై అవగాహన పెంచుకుంటే విజయానికి
తొలి అడుగు పడినట్లే.
*
స్టేజ్-1, స్టేజ్-2 సిలబస్ ఒకటే. అభ్యర్థులకు ఇదెంతో సానుకూల అంశం. ఒకే
సన్నద్ధతతో రెండు దశలనూ ఎదుర్కోవచ్చు. స్టేజ్-1 కంటే స్టేజ్-2 ప్రశ్నల
కఠినత్వం ఎక్కువ. అందువల్ల ప్రస్తుతం ప్రాథమికాంశాలు బాగా చదివి, తేలిక,
మధ్య స్థాయి ప్రశ్నలు బాగా సాధన చేయాలి.
*
పరీక్ష తేదీ ప్రకటించనందున ఎక్కువ వ్యవధే ఉంటుంది. ఇటీవలే కోర్సులు
పూర్తిచేసుకున్న తాజా అభ్యర్థులు సైతం ఉన్న సమయంలో సమగ్రంగా సన్నద్ధం
కావచ్చు.
* ఏదైనా విభాగంలోని ఒక
అంశాన్నే తీసుకుని మూడు రోజుల కేటాయించుకోవచ్చు. అందులో వీలైనన్ని మాదిరి
ప్రశ్నలు సాధన చేయాలి. అలాగే ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి.
*
నాలుగు నెలల్లో సిలబస్ మొత్తం క్షుణ్నంగా చదివి, మాదిరి ప్రశ్నలు సాధన
చేయడం పూర్తవుతుంది. అనంతరం పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. పరీక్ష
కోణంలో ఆలోచించి, ఏ అంశాలకు ప్రాధాన్యమివ్వాలో తెలుసుకుని, మళ్లీ చదవడం,
వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించడం చేయాలి.
*
పరీక్షకు రెండు నెలల ముందు నుంచీ రోజూ మాక్ టెస్టులు రాయాలి. ఫలితాలు
విశ్లేషించుకుని, చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుని, స్కోరు
పెంచుకోవడానికి కృషి చేయాలి.
* రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియనివి వదిలేయాలి.
*
స్టేజ్-1లో ప్రతి ప్రశ్నకు 54 సెకన్ల సమయం దక్కుతుంది. కొన్నింటికి ఈ
వ్యవధి సరిపోకపోవచ్చు. అందువల్ల వేగానికి ప్రాధాన్యముందని గ్రహించాలి.
మెలకువలు పాటించి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
*
మ్యాథమెటిక్స్ విభాగంలో ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ అరిథ్‌మెటిక్- ఆర్ఎస్
అగర్వాల్ పుస్తకం సరిపోతుంది. ఈ విభాగంలో త్రికోణమితి, ఆల్జీబ్రా.. మొదలైన
అంశాల కోసం పదో తరగతి గణిత పుస్తకాన్ని బాగా చదివి, వీలైనన్ని ప్రశ్నలు
సాధన చేయాలి.
* జనరల్
ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగానికీ ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్
పుస్తకం లేదా ఏదైనా తీసుకోవచ్చు. ఏ పుస్తకం చదివినప్పటికీ పరీక్షలో
పేర్కొన్న అంశాలకే పరిమితమై, వాటినే బాగా సాధన చేయాలి.
*
స్టేజ్-1, 2ల్లో ఎక్కువ ప్రాధాన్యం జనరల్ అవేర్నెస్దే. అందువల్ల అధిక
సమయం ఈ విభాగానికి కేటాయించాలి. సిలబస్‌లో పేర్కొన్న అంశాలకు చెందిన తాజా
వార్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే సరిపోతుంది. వర్తమాన వ్యవహారాల కోసం
ఏప్రిల్ 2024 నుంచి పరీక్ష తేదీ వరకు ముఖ్య సంఘటనలు గుర్తుంచుకోవాలి.
పత్రికలు చదువుతున్నప్పుడే ప్రశ్నగా రావడానికి అవకాశం ఉన్నవాటిని నోట్సు
రాసుకుంటే.. పరీక్షకు ముందు తక్కువ వ్యవధిలోనే పునశ్చరణ చేసుకోవచ్చు.
సీబీఎస్ఈ 8,9,10 తరగతుల సైన్స్, సోషల్ పుస్తకాలు బాగా చదివి ముఖ్యమైన
విషయాలు నోట్సు రాసుకోవాలి.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్లు