బెంగళూరులోని ఇస్రోలో టెక్నికల్‌ కొలువులు

ఇస్రోలో టెక్నికల్‌ కొలువులు

బెంగళూరులోని ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో), యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌, ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌.. 224 టెక్నీషియన్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.

 

మెకట్రానిక్‌, మెటీరియల్‌ సైన్స్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, ప్లంబర్‌, టర్నర్‌, కార్పెంటర్‌, వెల్డర్‌ మొదలైన విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి.

టెక్నికల్‌ అసిస్టెంట్‌

55 ఉద్యోగాలు వివిధ విభాగాల్లో ఉన్నాయి.

అగ్రికల్చర్‌ విభాగం: రిమోట్‌ సెన్సింగ్‌ అండ్‌ జీఐఎస్‌/ జియోఇన్ఫర్మాటిక్‌లో ఎంఈ/ఎంటెక్‌, నాలుగేళ్ల అగ్రికల్చర్‌ బీఎస్సీ పూర్తిచేయాలి.

ఫారెస్ట్రీ-ఎకాలజీ: బోటనీ/ ఫారెస్ట్రీ/ ఎకాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ-బోటనీ/ ఫారెస్ట్రీ/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి.

జియోఇన్ఫర్మాటిక్స్‌: కంప్యూటర్‌ సైన్స్‌ జియోఇన్ఫర్మాటిక్స్‌లో బీఈ/ బీటెక్‌తోపాటు రిమోట్‌ సెన్సింగ్‌, జీఐఎస్‌/ జియోఇన్ఫర్మాటిక్స్‌/ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌లో ఎంఈ/ ఎంటెక్‌ పూర్తిచేయాలి. వయసు 18-35 సంవత్సరాలు ఉండాలి.  

రాతపరీక్ష ఎలా?

రాత పరీక్షలో ప్రశ్నపత్రం 100 మార్కులకు 3 పార్టులుగా ఉంటుంది.

పార్ట్‌-ఎ: 60 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 60 మార్కులు. సరైన సమాధానానికి 1 మార్కు. ప్రతి తప్పు సమాధానానికీ 1/3 వంతు మార్కు తగ్గిస్తారు. వ్యవధి 75 నిమిషాలు. దీంట్లో 40 శాతం ప్రశ్నలు బీఈ/ బీటెక్‌ స్థాయిలో, 60 శాతం ప్రశ్నలు ఎంటెక్‌ సిలబస్‌ నుంచి ఇస్తారు.

పార్ట్‌-బి: ఆప్టిట్యూడ్‌/ ఎబిలిటీ టెస్ట్‌లో 15 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు - 20 మార్కులు. నెగెటివ్‌ మార్కులు ఉండవు. వ్యవధి 30 నిమిషాలు. న్యూమరికల్‌, లాజికల్‌, డయాగ్రామిక్‌, అబ్‌స్ట్రాక్ట్‌, డిడక్టివ్‌ రీజనింగ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

పార్ట్‌-సి: డిస్క్రిప్టివ్‌ ప్రశ్న 20 మార్కులకు ఉంటుంది. వ్యవధి 30 నిమిషాలు. స్పెషలైజేషన్‌కు సంబంధించిన టెక్నికల్‌ ప్రశ్న అడుగుతారు.

టెక్నీషియన్‌-బి/ డ్రాఫ్ట్స్‌మెన్‌-బి

ఇవి 142 పోస్టులు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ ఎస్‌ఎస్‌సీ/ మెట్రిక్యులేషన్‌తో పాటు.. ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌/ టెక్నీషియన్‌ పవర్‌ ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌/ మెకానిక్‌ కన్‌స్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ అప్లయన్సెస్‌/ మెకానిక్‌ ఇండస్ట్రియల్‌ ఎలక్ట్రానిక్స్‌ ట్రేడుల్లో ఐటీఐ/ ఎన్‌టీసీ/ ఎన్‌ఏసీ పాసవ్వాలి. వయసు 18-35 సంవత్సరాలు ఉండాలి.

ఎలక్ట్రికల్‌, ఫొటోగ్రఫీ/ డిజిటల్‌ ఫొటోగ్రఫీ/ ఫిట్టర్‌/ ప్లంబర్‌/ రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌/ టర్నర్‌/ కార్పెంటర్‌/ మోటర్‌ వెహికల్‌ మెకానిక్‌/ మెషినిస్ట్‌/ వెల్డర్‌/ డ్రాఫ్ట్స్‌మేన్‌-మెకానికల్‌/ డ్రాఫ్ట్స్‌మేన్‌ (సివిల్‌)/ మెకానికల్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు ఫీజు

సైంటిస్ట్‌/ ఇంజినీర్‌-ఎస్సీ/ టెక్నికల్‌ అసిస్టెంట్‌/ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.750. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఈ మొత్తం నుంచి దరఖాస్తు ఫీజు రూ.250 మినహాయించి.. రూ.500 తిరిగి చెల్లిస్తారు.

  • టెక్నీషియన్‌-బి పోస్టులకు దరఖాస్తు ఫీజు రూ.500. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజైన రూ.100 తగ్గించి.. రూ.400 తిరిగి చెల్లిస్తారు.
  • మహిళలు, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు ముందుగా ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష హాజరైన సమయంలో ఎలాంటి తగ్గింపూ లేకుండా ఫీజు మొత్తాన్ని వారికి తిరిగి చెల్లిస్తారు.
  • రాత పరీక్షకు హాజరుకానివారికి ఫీజు రిఫండ్‌ చేయరు.
  • ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసినప్పటికీ పర్మనెంట్‌ చేసే అవకాశం ఉంది.
  • ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ విధానంలో చదివినవాళ్లు.. సైంటిస్ట్‌/ఇంజినీర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అనర్హులు.
  • ఇంటర్వ్యూ/ స్కిల్‌ టెస్ట్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ట్రావెలింగ్‌ అలవెన్స్‌ చెల్లిస్తారు. తాజా ఉద్యోగ సమాచారాన్ని ఇస్రో/ యూఆర్‌ఎస్సీ/ ఐఎస్‌టీఆర్‌ఏసీ వెబ్‌సైట్ల ద్వారా  
  • తెలియజేస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ: 01.03.2024

వెబ్‌సైట్‌: www.isro.gov.in



సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ - ఎస్సీ, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, లైబ్రరీ అసిస్టెంట్‌, ఫైర్‌మేన్‌-ఎ, కుక్‌, లైట్‌ వెహికల్‌ డ్రైవర్‌ ఎ అండ్‌ హెవీ వెహికల్‌ డ్రైవర్‌ ఏ పోస్టులు 27 ఉన్నాయి. రాత పరీక్ష/ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

ప్రశ్నపత్రంలోని 2 పార్ట్‌లకు 100 మార్కులు. పార్ట్‌-ఎలో 80 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 80 మార్కులు. సరైన సమాధానానికి 1 మార్కు. ప్రతి తప్పు సమాధానానికీ 1/3 వంతు మార్కు తగ్గిస్తారు. వ్యవధి 90 నిమిషాలు.

  • పార్ట్‌-బిలో ఆప్టిట్యూడ్‌/ ఎబిలిటీ టెస్ట్‌ ఉంటుంది. 15 ప్రశ్నలకు 20 మార్కులు. వ్యవధి 30 నిమిషాలు. న్యూమరికల్‌, లాజికల్‌, డయాగ్రామిక్‌, అబ్‌స్ట్రాక్ట్‌, డిడక్టివ్‌ రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
  • రుణాత్మక మార్కులు లేవు.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.