2024-25 | 8వ తరగతిలో మిలిటరీ అకాడమీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ | ఏపీపీఎస్సీ- ఆర్ఐఎంసీ (జులై- 2024 టర్మ్) లో ఎనిమిదో తరగతి ప్రవేశాలు – దరఖాస్తు వివరాలు ఇవే

APPSC-RIMC Admission (July 2024 Term) – Rashtriya Indian Military College Entrance Exam – Details Here  

ఏపీపీఎస్సీ- ఆర్ఐఎంసీ (జులై- 2024 టర్మ్) లో ఎనిమిదో తరగతి ప్రవేశాలు దరఖాస్తు వివరాలు ఇవే


భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఉత్తరాఖండ్ రాష్ట్రం దెహ్రాదూన్ లోని  రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఐఎంసీ) జులై- 2024 టర్మ్ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన బాలురు, బాలికల నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది

ఆర్ఐఎంసీ లో ఎనిమిదో తరగతి ప్రవేశాలు జులై- 2024 టర్మ్

అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2024 జులై నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.

వయసు: 01.07.2024 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి. 02.07.2011 - 01.01.2013 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, వైవా వోస్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

పరీక్షా విధానం: రాత పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. అవి మ్యాథమేటిక్స్(200 మార్కులు), జనరల్ నాలెడ్జ్(75 మార్కులు), ఇంగ్లిష్ (125 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వైవా వోస్ (50 మార్కులు) నిర్వహిస్తారు. రాత పరీక్ష, వైవా వోస్ కలిపి మొత్తం 450 మార్కులకు కేటాయించారు. దీనిలో కనీస ఉత్తీర్ణత మార్కులు 50% ఉండాలి. ఈ రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.555 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. ఆరన్ఎంసీ పంపిన దరఖాస్తు ఫారం నింపి అవసరమైన ధ్రువతపత్రాలు జతచేసి అసిస్టెంట్ సెక్రటరీ(ఎగ్జామ్స్), ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, న్యూ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ బిల్డింగ్, రెండో అంతస్తు, ఆర్టీఏ కార్యాలయం దగ్గర, ఎంజీ రోడ్డు, విజయవాడ చిరునామాకు పంపించాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు చివరి తేది: 15.10.2023.

పరీక్ష తేది: 02-12-2023.

=======================

NOTIFICATION

WEB NOTE

MAIN WEBSITE

APPSC WEBSITE

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

శ్రీ సత్యసాయి జిల్లా, మిషన్ వాత్సల్య పథకం కింద చిల్డ్రన్స్ హోమ్, ధర్మవరం మరియు హిందూపూర్ రిక్రూట్‌మెంట్. Recruitment of Children Home, Dharmavaram and Hindupur Under Mission Vatsalya Scheme, Sri Sathya Sai Dist.

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)