DSC Recruitment: 12 నుంచి డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ * మొత్తం 6,100 పోస్టుల భర్తీ * ఎంపికైన వారికి జూన్ 8న పోస్టింగులు
ఏపీలో ఉపాధ్యాయ కొలువుల భర్తీకి సోమవారం (ఫిబ్రవరి 12) డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. సాధారణ ఎన్నికల ముందు ఏపీ డీఎస్సీ-2024 షెడ్యూలును మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏడు యాజమాన్యాల్లో కలిపి 6,100 పోస్టులను భర్తీ చేయనున్నామని, ఉపాధ్యాయ నియామకాలతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహిస్తున్నామని వెల్లడించారు. డీఎస్సీకి 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఏప్రిల్ 31 వరకు రాబోయే ఖాళీలనూ పరిగణనలోకి తీసుకొని, ఈ పోస్టులను ప్రకటించారు. డీఎస్సీలో ఎంపికైన వారికి జూన్ 8న పోస్టింగులు ఇస్తామని వెల్లడించారు. నిరుద్యోగులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా ఐదేళ్ల సడలింపు, దివ్యాంగులకు 54 ఏళ్లుగా వయోపరిమితి నిర్ణయించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలను ఏపీతో పాటు పక్క రాష్ట్రాల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, బరంపూర్‌లో కేటాయించారు. ఆన్‌లైన్ పరీక్షలను రోజుకు రెండు విడతల్లో నిర్వహిస్తారు. ఉదయం విడత 9.30 నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు ఉంటాయి.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు