7, ఫిబ్రవరి 2024, బుధవారం

AP DSC TET: డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల * మొత్తం 6,100 ఖాళీల భర్తీ * తాజా నిబంధనలు ఇవే.. * కొత్తగా అప్రెంటిస్‌షిప్‌ విధానం

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగ ఆశావహులు ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్‌ (DSC Notification 2024) విడుదలైంది. మొత్తం 6,100 పోస్టులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం (ఫిబ్రవరి 7) నోటిఫికేషన్‌ విడుదల చేశారు. వీటిలో ఎస్జీటీ పోస్టులు 2,280 ఉండగా.. స్కూల్‌ అసిస్టెంట్‌ 2,299; టీజీటీ 1,264; పీజీటీ 215; ప్రిన్సిపల్‌ 42 ఉద్యోగాలు చొప్పున భర్తీ చేయనున్నారు. డీఎస్సీ 2024 పరీక్షతో పాటు టెట్‌ 2024 పరీక్షకూ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. టెట్‌కు ఫిబ్రవరి 8 నుంచి, డీఎస్సీకి ఫిబ్రవరి 12 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. 


 

* డీఎస్సీ షెడ్యూల్ ఇదే..

డీఎస్సీ నియామకానికి సంబంధించి ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. మాక్‌ టెస్ట్‌ను ఫిబ్రవరి 24 నుంచి రాయొచ్చు. మార్చి 5 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి తెస్తారు. డీఎస్సీ పరీక్షలు మార్చి 15 నుంచి 30 వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. సెషన్‌ 1 ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు; సెషన్‌ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. డీఎస్సీ ప్రాథమిక కీని మార్చి 31న విడుదల చేసి ఏప్రిల్‌ 1వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 2న తుది కీ విడుదల చేసి ఫలితాలను ఏప్రిల్‌ 7న ప్రకటిస్తారు.

* టెట్‌ షెడ్యూల్‌..

ఏపీ టెట్‌ పరీక్షకు ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌ 19న అందుబాటులోకి వస్తుంది. టెట్‌ హాల్‌ టికెట్లు ఫిబ్రవరి 23నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ప్రాథమిక కీని మార్చి 10న విడుదల చేస్తారు. ఈ కీపై మార్చి 11వరకు అభ్యంతరాలు స్వీకరించి 13న తుదికీ విడుదల చేస్తారు. మార్చి 14న టెట్‌ ఫలితాలు ప్రకటిస్తారు.

* డీఈడీ వారికే ఎస్జీటీ అర్హత

సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు పేపర్‌-1, స్కూల్‌ అసిస్టెంట్లకు పేపర్‌-2 విడివిడిగా టెట్‌ నిర్వహిస్తారు. ఎస్జీటీ పోస్టులకు డీఈడీ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ చదివిన వారు మాత్రమే అర్హులు. టెట్‌ రాసేందుకు ఓసీలకు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉండాలి. స్కూల్‌ అసిస్టెంట్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైన అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులు 40 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ఈ ఒక్కసారికే అనుమతించింది. గత ప్రభుత్వంలో 2018లో చివరిసారిగా డీఎస్సీ నిర్వహించారు. మొత్తం 7,902 పోస్టులకు ప్రకటన ఇవ్వగా.. 6.08 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించినందున ఈ పోస్టులకు డీఎస్సీ, టెట్‌ కలిపి 100 మార్కులకు నిర్వహించారు. టీజీటీ వారికి ఆంగ్ల భాషలో స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించారు. ఈసారి టెట్‌, డీఎస్సీ విడివిడిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. టెట్‌, డీఎస్సీ రెండింటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యేనాటికి ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉంది.

AP TET DSC Update


Syllabus https://aptet.apcfss.in/Documents/aptet_syllabus_2024.pdf

Notification https://aptet.apcfss.in/Documents/aptet_2024_notification.pdf

Information Bulletin https://aptet.apcfss.in/Documents/aptet_2024_information_bulletin.pdf

Schedule https://aptet.apcfss.in/Documents/aptet_2024_schedule.pdf

Payment Start Date 08.02.2024 | Payment End Date 17.02.2024
Application Start Date  08.02.2024 | Application End Date 18.02.2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: