SSC: కేంద్ర శాఖల్లో 2,049 సెలక్షన్ పోస్టులు
SSC: కేంద్ర శాఖల్లో 2,049 సెలక్షన్ పోస్టులు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) తాజాగా సెలక్షన్ పోస్టుల నియామక పరీక్ష (ఫేజ్-XII/ 2024)కు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని పలు విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేస్తోంది. పది, పన్నెండో తరగతి, డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ తదితరాల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఖాళీలున్న విభాగాలు: ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, సెంట్రల్ వాటర్ కమిషన్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మినిస్ట్రీ, హోం అఫైర్స్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిషరీస్, సెంట్రల్ ట్రాన్స్‌లేషన్ బ్యూరో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ తదితరాలు.
ఖాళీల వివరాలు:
* సెలక్షన్ (ఫేజ్-XII/ 2024): 2,049 పోస్టులు (ఎస్సీ- 255; ఎస్టీ- 124; ఓబీసీ- 456; యూఆర్- 1028; ఈడబ్ల్యూఎస్- 186)
లెవెల్స్: 1, 2, 3, 4, 5, 6.
పోస్టులు: లైబ్రరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ఫీల్డ్‌మ్యాన్, అకౌంటెంట్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ల్యాబొరేటరీ అటెండెంట్, ఫోర్‌మాన్, జూనియర్ ఇంజినీర్, యూడీసీ, డ్రైవర్-కమ్ మెకానిక్, టెక్నికల్ అసిస్టెంట్, సూపర్‌వైజర్, సీనియర్ ట్రాన్స్‌లేటర్, స్టోర్ కీపర్ ఎంట్రీ ఆపరేటర్, రిసెర్చ్ ఇన్వెస్టిగేటర్, కోర్ట్ క్లర్క్, సీనియర్ జియోగ్రాఫర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: కనిష్ఠంగా 18 ఏళ్లు నిండి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్- టైపింగ్/ డేటా ఎంట్రీ/ కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సంబంధిత ఖాళీలకు మాత్రమే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
పరీక్ష విధానం (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): జనరల్ ఇంటెలిజెన్స్ (25 ప్రశ్నలు, 50 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు, 50 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అరిథ్‌మెటిక్ స్కిల్) (25 ప్రశ్నలు, 50 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్) (25 ప్రశ్నలు, 50 మార్కులు). ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
పరీక్ష వ్యవధి: 60 నిమిషాలు.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 26.02.2024 నుంచి 18.03.2024 వరకు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18.03.2024.
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 19.03.2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 22.03.2024 నుంచి 24.03.2024 వరకు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: 06 నుంచి 08-05-2024 వరకు.
Important Links
Posted Date: 27-02-2024
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు