ICICI Bank PO: ఐసీఐసీఐ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు
ICICI Bank PO: ఐసీఐసీఐ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు
ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్యాంక్ (ఐసీఐసీఐ బ్యాంక్)... ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రోగ్రామ్- 2024కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా ఎంపికైన అభ్యర్థులకు పీఓ ప్రోగ్రామ్‌లో శిక్షణ ఉంటుంది. ఏడాది కోర్సు పూర్తయిన తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న ఐసీఐసీఐ శాఖల్లో పీఓ హోదాలో నియమితులవుతారు. ఈ కోర్సును మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌తో కలిసి ఐసీఐసీఐ సంయుక్తంగా నిర్వహిస్తోంది. శిక్షణ కాలంలో స్టైపెండ్ అందుతుంది.
ప్రకటన వివరాలు...
* ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రోగ్రామ్
విభాగం: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ (సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్)
కోర్సు కాలపరిమితి: ఏడాది
విద్యార్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి ఏడాది పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 27 ఏళ్లకు మించకూడదు.
ప్రోగ్రామ్ ఫీజు: రూ.2,55,500.
స్టైపెండ్: ఏడాదికి రూ.2.32 లక్షల నుంచి రూ.2.60 లక్షలు.
ప్రారంభ వార్షిక వేతనం: రూ.5.00 లక్షల నుంచి రూ.5.50 లక్షల వరకు.
ఎంపిక విధానం: ఆన్లైన్ ఆప్టిట్యూట్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ఎలాంటి ఫీజు లేదు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 2.
Important Links
Posted Date: 03-02-2024
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్లు