12, ఫిబ్రవరి 2024, సోమవారం

SSC Constable: తెలుగులోనూ కానిస్టేబుల్ పరీక్ష ప్రశ్నపత్రం * ఫిబ్రవరి 29 నుంచి మార్చి 12 వరకు పరీక్షలు * మొత్తం 26,146 పోస్టుల భర్తీ

కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ ఖాళీల నియామక రాత పరీక్ష ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌తో పాటు ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఇందులో తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మళయాళం, ఉర్దూ తదితర 13 ప్రాంతీయ భాషలు ఉన్నాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. పరీక్ష కేంద్రాల వివరాలు, అప్లికేషన్‌ స్టేటస్‌ వివరాలు సైతం ఇప్పటికే ఎస్‌ఎస్‌సీ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 26,146 పోస్టులు భర్తీ కానున్నాయి. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి పరీక్ష కేంద్రం, అప్లికేషన్‌ స్టేటస్‌ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ స్లిప్పులో రోల్‌ నంబర్‌, పరీక్ష తేదీ, పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం, విధివిధానాలు తదితర సమాచారం ఉంటుంది. త్వరలో అడ్మిట్‌ కార్డులు విడుదల కానున్నాయి. ఆన్‌లైన్ పరీక్ష ఫిబ్రవరి 29 నుంచి మార్చి 12వ తేదీ వరకు జరుగనుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.  


 సదరన్‌ రీజియన్‌లో అప్లికేషన్‌ స్టేటస్‌ కోసం క్లిక్‌ చేయండి  
 

  సదరన్‌ రీజియన్‌లో పరీక్ష కేంద్రం వివరాల కోసం క్లిక్‌ చేయండి  

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: