8, ఫిబ్రవరి 2024, గురువారం

AP DSC Notification details: 12న డీఎస్సీ నోటిఫికేషన్‌ మొత్తం రిటైర్మెంట్‌లతో కలిపి 6,100 పోస్టుల భర్తీకి చర్యలు


12న డీఎస్సీ నోటిఫికేషన్‌
మొత్తం రిటైర్మెంట్‌లతో కలిపి 6,100 పోస్టుల భర్తీకి చర్యలు
మార్చి 15 నుంచి పరీక్షలు
టెట్‌ షెడ్యూల్‌
డీఎస్సీ షెడ్యూల్‌ ఇదీ..

● ఏప్రిల్‌ 7న ఫలితాలు: మంత్రి బొత్స

● నేటి నుంచి టెట్‌కు దరఖాస్తులు

రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు డీఎస్సీ నోటిఫికేషన్‌ వివరాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం వెల్లడించారు. మొత్తం 6,100 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. భర్తీ చేయనున్న ఖాళీలు ప్రస్తుతం ఉన్నవే కాదని, ఈ ఏడాది ఏప్రిల్‌ 31 నాటికి రిటైరయ్యే వారిని కూడా కలిపి అంచనా వేసినట్లు పేర్కొన్నారు. జూన్‌ నాటికి కొత్తగా ఉద్యోగాలు పొందిన టీచర్లకు పోస్టింగ్‌లు ఇచ్చి, పాఠశాలల్లో ఒక్క ఖాళీ కూడా లేకుండా చూస్తామన్నారు. 2018 డీఎస్సీలో ఉన్న నిబంధనలనే ఇప్పుడు అమలు చేయబోతున్నట్టు చెప్పారు. తమ ప్రభుత్వంలో 14,219 టీచర్‌ పోస్టులను భర్తీ చేసినట్టు తెలిపారు. వీటిలో 1998, 2008 డీఎస్సీకి చెందిన ఎంటీఎస్‌ టీచర్లు కూడా ఉన్నారని చెప్పారు. ఎన్నికల తర్వాత పోస్టింగులు ఇచ్చే ప్రక్రియ ఉంటుందని, అందువల్ల ఎన్నికల కారణంగా ఇది మధ్యలో నిలిచిపోయే అవకాశం లేదని తెలిపారు. గత ప్రభుత్వం పరీక్షల్లో అక్రమాలను ప్రోత్సహించిందని, తాము పాస్‌ పర్సంటేజీల కోసం కాకుండా పరీక్షలను పరీక్షల్లా నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యా సంవత్సరం మధ్యలో రిటైర్‌ అయ్యే టీచర్లను విద్యా సంవత్సరం ముగిసే వరకూ కొనసాగించాలనే ఆలోచన ఉందన్నారు.

టెట్‌ షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ తెలిపారు. గురువారం టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల అవుతుందన్నారు. ఈ నెల 17 వరకు ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించవచ్చు. 18 వరకు దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉంది. ఈ నెల 23 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 27 నుంచి మార్చి 9 వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు వారికి కావాల్సిన పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు. ఎవరైనా ఎంపిక చేసుకోకపోతే వారికి సమీపంలోని కేంద్రం ఆటోమేటిక్‌గా ఎంపిక అవుతుంది.

డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ వివరించారు. ఈ నెల 12న నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. అదే రోజు నుంచి ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం. ఈ నెల 12 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో ఫీజుల చెల్లింపు. మార్చి 5 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం. మార్చి 15 నుంచి 30 వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. జనరల్‌ అభ్యర్థులకు 44 ఏళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు అర్హతగా నిర్ణయించారు.

భర్తీ చేయనున్న పోస్టులు

సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ) 2,280

స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ) 2,299

ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ) 1,264

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ) 215

ప్రిన్సిపాల్‌ 42

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: