RRB Annual Calendar: రైల్వే ఉద్యోగాల క్యాలెండర్-2024 విడుదల
RRB Annual Calendar: రైల్వే ఉద్యోగాల క్యాలెండర్-2024 విడుదల
* ఎన్‌టీపీసీ, ఇంజినీర్ నియామకాలు ఎప్పుడంటే?
* ఆర్‌ఆర్‌బీ సిలిగురి వెల్లడి
ఉద్యోగార్థులకు
రైల్వే శాఖ తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా రైల్వే రిక్రూట్‌మెంట్
బోర్డు పరిధిలోని జోన్లలో వివిధ ఉద్యోగాల నియామక పరీక్షలకు సంబంధించి
కేంద్రీకృత వార్షిక క్యాలెండర్‌ను జారీ చేసింది. తాజాగా పరీక్షల
షెడ్యూల్‌ను ఆర్‌ఆర్‌బీ సిలిగురి అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.
ఇప్పటికే 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
కాగా.. 9 వేల టెక్నీషియన్ ఖాళీల భర్తీకి రైల్వే శాఖ సమాయత్తమవుతోంది.
టెన్త్, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆయా
ఉద్యోగాలకు అర్హులు. రాత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్
ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వార్షిక
క్యాలెండర్‌లో ఏఎల్‌పీ, టెక్నీషియన్, జేఈ తదితర పోస్టుల నియామక షెడ్యూల్
వివరాలు ఉన్నాయి.
కేంద్రీకృత వార్షిక క్యాలెండర్ 2024 వివరాలు...
కేటగిరీ | నియామక షెడ్యూల్ |
అసిస్టెంట్ లోకో పైలట్ | జనవరి - మార్చి |
టెక్నీషియన్ | ఏప్రిల్ - జూన్ |
నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ- గ్రాడ్యుయేట్ (లెవెల్ 4, 5, 6) |
జులై- సెప్టెంబర్ |
నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ- గ్రాడ్యుయేట్ (లెవెల్ 2, 3) | |
జూనియర్ ఇంజినీర్ | |
పారామెడికల్ కేటగిరీ | |
లెవెల్ 1, మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీలు | అక్టోబర్- డిసెంబర్ |
ఆర్‌ఆర్‌బీ సిలిగురి అధికారిక ప్రకటన
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు