5, ఫిబ్రవరి 2024, సోమవారం

AP Teacher Posts: 2217 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్‌ | మొదట టెట్‌ నిర్వహించి, ఆ తరువాత డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న ఉపాధ్యాయ పోస్టుల్లో సింహభాగం ఉమ్మడి కర్నూలు జిల్లాకు దక్కే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యలో 4,057 టీచర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫై చేశారు. ఇందులో ఉమ్మడి కర్నూలు జిల్లాకు 2,217 పోస్టులు నోటిఫై అయ్యాయి. 2008 డీఎస్సీ ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,683 పోస్టులు భర్తీ అయ్యాయి.

2,217 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.
ఇందులో భాగంగా 2008 డీఎస్సీలో అర్హత పొంది ఉద్యోగాలు పొందలేకపోయిన వారితో పాటు 1998 డీఎస్సీ అర్హులకు మినిమం టైం స్కేల్‌తో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చింది. 2024 డీఎస్సీలో జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు టీచర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు 2,217 పోస్టులు విద్యాశాఖ నోటిఫై చేసింది.

వీటికి రెసిడెన్షియల్‌, ఏపీ మోడల్‌ స్కూల్స్‌, ఆశ్రమ స్కూల్స్‌, మున్సిపల్‌ స్కూళ్లలోని ఖాళీలు అదనంగా జతకానున్నాయి. ప్రస్తుతం నోటిఫై చేసిన పోస్టులను అవసరమైన మేరకు ఖరారు చేసి జాబితాను శనివారం రాత్రికి కమిషనర్‌ ఆఫీస్‌కి డీఈఓ ఆధ్వర్యంలో పంపనున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 2,865 ఉండగా, వీటిలో 4.57 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 12,700 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 15,298 మంది ఉపాధ్యాయులు ఉండాలి. ప్రస్తుతం 2,217 పోస్టులను నోటిఫై చేయడంతో నిరుద్యోగులకు ఊరట లభించింది.




2024 డీఎస్సీ ద్వారా ఇచ్చే పోస్టులతో కలిపితే మొత్తంగా 3,238 టీచర్‌ పోస్టులను భర్తీ చేసినట్లు అవుతుంది. మొదట టెట్‌ నిర్వహించి, ఆ తరువాత డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రెండు నోటిఫికేషన్లు వారం రోజుల్లో రానున్నాయి.

డీఎస్పీ ద్వారా భర్తీ చేసే అవకాశం

ఎస్‌జీటీ 1,646, స్కూల్‌ అసిస్టెంట్‌

571 పోస్టులు

వీటికి అదనంగా రెసిడెన్షియల్‌,

మున్సిపల్‌, ఏపీ మోడల్‌ స్కూళ్ల

పోస్టులు పెరిగే అవకాశం

ఉమ్మడి క ర్నూలు జిల్లాలో నోటిఫై చేసిన పోస్టుల వివరాలు..

క్యాటగిరీ పోస్టులు ఖాళీల

వివరాలు

స్కూల్‌ అసిస్టెంట్‌(లాంగ్వేజ్‌–1) 84

స్కూల్‌ అసిస్టెంట్‌(లాంగ్వేజ్‌–2) 113

స్కూల్‌ అసిస్టెంట్‌ ఇంగ్లిషు 43

స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం 73

స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌ 44

స్కూల్‌ అసిస్టెంట్‌ 44

బయోలాజికల్‌ సైన్స్‌

స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ 35

స్కూల్‌ అసిస్టెంట్‌ 135

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌

ఎస్‌జీటీ(తెలుగు మీడియం) 1,614

ఎస్‌జీటీ(కన్నడ మీడియం) 32

మొత్తం పోస్టులు 2,217

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: