Army: ఆర్మీ నర్సింగ్ కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సు
Army: ఆర్మీ నర్సింగ్ కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సు భా రత సైన్యం... 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న అయిదు కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆఫ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (ఏఎఫ్‌ఎంఎస్)లో ప్రారంభమయ్యే నాలుగేళ్ల బీఎస్సీ(నర్సింగ్) కోర్సులో ప్రవేశానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కోర్సు- సీట్ల వివరాలు: * నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ (ఫిమేల్): 220 సీట్లు ఏఎఫ్‌ఎంఎస్, సీట్లు: కాలేజ్ ఆఫ్ నర్సింగ్, పుణె- 40, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, కోల్‌కతా- 30, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ముంబయి- 40, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, లఖ్‌నవూ- 40, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బెంగళూరు- 40. అర్హత: అవివాహిత/ విడాకులు తీసుకున్న/ చట్టబద్ధంగా విడిపోయిన/ వితంతువులైన మహిళా అభ్యర్థులు అర్హులు. కనీసం 50% మార్కులు సీనియర్ సెకండరీ పరీక్ష 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్). నీట్ (యూజీ) 2024లో అర్హత సాధించి ఉండాలి. కనిష్ఠ ఎత్తు 152 సెం.మీ. కలిగి ఉండాలి. వయ