Indian Navy: నౌకాదళంలో 741 ఛార్జ్‌మ్యాన్, ఫైర్‌మ్యాన్ పోస్టులు

భారత నౌకాదళం... 741 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ విద్యార్హతలతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్‌ నేవీ సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (INCET-01/2024)తో ఈ పోస్టులు భర్తీ చేస్తారు. గ్రూప్‌ బీ, గ్రూప్‌ సీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటికి ఎంపికైనవారు ఛార్జ్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్‌, ఫైర్‌మ్యాన్ హోదాతో విధులు నిర్వర్తిస్తారు. ఇవన్నీ సాంకేతిక సేవలకు చెందిన ఉద్యోగాలే. రాత పరీక్ష, వైద్య తదితర పరీక్షలతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. దేశంలో ఉన్న నేవీ కేంద్రాల్లో వీరు విధులు నిర్వర్తిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 2వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

* పరీక్ష పేరు: ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్‌సెట్‌-01/2024)

పోస్టుల వారీగా ఖాళీలు:

* జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘బి (ఎన్‌జీ)’, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్, నాన్ మినిస్టీరియల్

1. ఛార్జ్‌మ్యాన్ (అమ్యూనిషన్‌ వర్క్‌షాప్)- 01

2. ఛార్జ్‌మ్యాన్ (ఫ్యాక్టరీ)- 10

3. ఛార్జ్‌మ్యాన్ (మెకానిక్)- 18 

4. సైంటిఫిక్ అసిస్టెంట్- 04


* జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘సి’, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్

5. డ్రాఫ్ట్స్‌మ్యాన్ (కన్‌స్ట్రక్షన్‌)- 02

6. ఫైర్‌మ్యాన్- 444

7. ఫైర్ ఇంజిన్ డ్రైవర్- 58 

8. ట్రేడ్స్‌మ్యాన్ మేట్- 161 

9. పెస్ట్ కంట్రోల్ వర్కర్- 18 

10. కుక్- 09 

11. ఎంటీఎస్‌ (మినిస్టీరియల్)- 16 

* మొత్తం పోస్టుల సంఖ్య: 741.

* అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: ఛార్జ్‌మ్యాన్ (మెకానిక్), సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. ఫైర్‌మ్యాన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ పోస్టులకు 18-27 ఏళ్లలోపు ఉండాలి. మిగిలిన పోస్టులకు 18-25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 

* ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు చెల్లించనవసరం లేదు. మిగిలినవారికి రూ.295. 

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02-08-2024.

ముఖ్యాంశాలు:

 * 741 ఉద్యోగాలకు భారత నౌకాదళం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

 * ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ విద్యార్హతలతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. 

 ఇండియన్‌ నేవీ సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్టుతో పోస్టులు భర్తీ చేస్తారు. 

  * ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 2వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


Notification
Official Website


 



-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

శ్రీ సత్యసాయి జిల్లా, మిషన్ వాత్సల్య పథకం కింద చిల్డ్రన్స్ హోమ్, ధర్మవరం మరియు హిందూపూర్ రిక్రూట్‌మెంట్. Recruitment of Children Home, Dharmavaram and Hindupur Under Mission Vatsalya Scheme, Sri Sathya Sai Dist.

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)