SSC Stenographer: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2,006 స్టెనోగ్రాఫర్ పోస్టులు SSC Stenographer: 2,006 Stenographer Posts in Central Govt

SSC Stenographer: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2,006 స్టెనోగ్రాఫర్ పోస్టులు

న్యూదిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ)… దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో/ విభాగాల్లో/ సంస్థల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి(గ్రూప్ బి, నాన్ గెజిటెడ్‌), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి(గ్రూప్ సి) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

డిపార్ట్‌మెంట్ పేరు: సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్‌మెంట్ అండ్‌ రెజువెనేషన్‌, ఇండియన్‌ మెటియోరాలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌, మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌, మినిస్ట్రీ ఆఫ్‌ ఎక్స్‌టర్నల్‌ అఫైర్స్‌, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తదితరాలు.
వివరాలు…
1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి (గ్రూప్-బి, నాన్-గెజిటెడ్)
2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డి (గ్రూప్-సి)
మొత్తం ఖాళీల సంఖ్య: 2,006.
అర్హత‌: ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.
వయోపరిమితి: 01-08-2024 నాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్- సి పోస్టులకు 18-30 ఏళ్లు, గ్రేడ్- డి పోస్టులకు 18-27 ఏళ్లు మించకూడదు. వివిధ కేటగిరీల వారీగా వయో సడలింపు కల్పించారు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10- 15 ఏళ్ల వయో సడలింపు ఇచ్చారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ అంశాల్లో ప్రశ్నలుంటాయి.
ప్రశ్నపత్రం: జనరల్ ఇంటెలిజెన్స్ అండ్‌ రీజనింగ్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ (100 ప్రశ్నలు- 100 మార్కులు). ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్‌లో ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లిష్/ హిందీ మాధ్యమంలో ఉంటాయి
పరీక్ష వ్యవధి: 2 గంటలు. మొత్తం మార్కులు: 200.
దరఖాస్తు రుసుము: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన తేదీలు… 
* ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 26.07.2024 నుంచి 17.08.2024 వరకు.
* ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 17.08.2024.
* ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 18.08.2024.
* దరఖాస్తు సవరణ తేదీలు: 27.08.2024 నుంచి 28.08.2024 వరకు.
* కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్: అక్టోబర్/ నవబర్‌, 2024.

ముఖ్యాంశాలు:
* దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి ఎస్ఎస్‌సీ ప్రకటన విడుదల చేసింది. 
* ఈ పోస్టులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
* ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

SSC Stenographer: 2,006 Stenographer Posts in Central Govt

Staff Selection Commission (SSC), New Delhi... is inviting applications for filling up the vacant posts of Stenographer Grade C (Group B, Non-Gazetted), Stenographer Grade D (Group C) in various Ministries/Departments/Institutions across the country. These posts are selected on the basis of computer based test and skill test. Interested candidates should apply online by 17th August.

Name of the Department: Central Administrative Tribunal, Central Board of Indirect Taxes and Customs, Central Vigilance Commission, Department of Agriculture Cooperation and Farmers Welfare, Department of Water Resources, River Development and Rejuvenation, Indian Meteorological Department, Ministry of Defence Tree of External Affairs, Telecom Regulatory Authority of India etc.
Details…
1. Stenographer Grade-C (Group-B, Non-Gazetted)
2. Stenographer Grade-D (Group-C)
Total No. of Vacancies: 2,006.
Eligibility: Intermediate/ Equivalent Pass. Candidates having skill in stenography are eligible to apply.
Age Limit: Not exceeding 18-30 years for Stenographer Grade-C posts and 18-27 years for Grade-D posts as on 01-08-2024. Age relaxation has been provided for various categories. Five years for SC/STs, three years for OBCs and 10-15 years for disabled.
Selection Process: Selection will be based on Computer Based Test, Skill Test in Stenography. The computer based test contains questions on General Intelligence and Reasoning, General Awareness, English Language and Comprehension.
Question Paper: General Intelligence and Reasoning (50 Questions- 50 Marks), General Awareness (50 Questions- 50 Marks), English Language and Comprehension (100 Questions- 100 Marks). The question paper will be objective type multiple choice. Questions will be in English/Hindi medium
Duration of Exam: 2 Hours. Total Marks: 200.
Application Fee: Rs.100. Women, SC, ST, ex-servicemen and disabled persons are exempted from the fee.
Exam centers in AP and Telangana states: Guntur, Kurnool, Rajahmundry, Tirupati, Vijayawada, Visakhapatnam, Hyderabad, Warangal.
Application Procedure: Apply through online mode.
Important Dates…
* Online Application Dates: 26.07.2024 to 17.08.2024.
* Last Date of Offline Application: 17.08.2024.
* Last Date of Online Fee Payment: 18.08.2024.
* Application Revision Dates: 27.08.2024 to 28.08.2024.
* Computer Based Test Schedule: October/ November, 2024.

Highlights:
* SSC has released notification for the recruitment of stenographer posts in various ministries across the country.
* These posts will be selected on the basis of computer based test and skill test.
* Interested candidates should apply online by 17th August.

https://ssc.gov.in/api/attachment/uploads/masterData/NoticeBoards/Notice_of_steno_2024_07_26.pdf


 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh