NEET UG: జులై మూడో వారంలో నీట్‌ (యూజీ) కౌన్సెలింగ్‌ * జులై 18కి విచారణ వాయిదా

నీట్‌ (యూజీ) పరీక్షలో అవకతవకలకు ఆధారాల్లేవని, పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని, జులై మూడో వారంలో కౌన్సెలింగ్‌ ప్రారంభిస్తామని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అదనపు అఫిడవిట్‌ను సమర్పించింది. ఈ నేపథ్యంలో జులై 11న సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణ జులై 18కి వాయిదా పడింది. కేంద్రం, జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) దాఖలు చేసిన ప్రమాణ పత్రం ప్రతులు కొన్ని పక్షాలకు ఇంకా అందలేదని, అందుకే వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. తొలుత విచారణను జులై 15న వాయిదా వేయాలని న్యాయమూర్తులు భావించారు. అయితే ఆ రోజు తాను, అటార్నీ జనరల్‌ అందుబాటులో ఉండబోమని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలపడంతో జులై 11న వాదనలు వింటామని పేర్కొన్నారు. పరీక్షలో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. విచారణ పురోగతికి సంబంధించి స్థాయీ నివేదికను తమకు సమర్పించినట్లు ఈ సందర్భంగా ధర్మాసనం తెలిపింది. నీట్‌ (యూజీ)-2024 పరీక్షా ఫలితాల డేటాను విశ్లేషించి ఐఐటీ మద్రాస్‌ ఇచ్చిన నివేదికతో జులై 10న కేంద్రం అదనపు ప్రమాణపత్రం దాఖలు చేసింది. అవకతవకలు జరిగినట్లు నివేదిక ఎక్కడా ప్రస్తావించలేదని అందులో పేర్కొంది. కౌన్సెలింగ్‌ ప్రక్రియ జులై మూడో వారం నుంచి ప్రారంభం అవుతుందని, నాలుగు రౌండ్లలో నిర్వహిస్తామని తెలిపింది. ఎన్టీఏ విడిగా ప్రమాణపత్రం దాఖలు చేసింది. అందులో జాతీయ, రాష్ట్ర, నగర స్థాయిలో మార్కులపై విశ్లేషణ చేయించామని, ఎక్కడా అసాధారణ స్థాయిలు కనిపించలేదని తెలిపింది. 

జులై 11న కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్‌ను ఆయన నివాసంలో నీట్‌ అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా పరీక్షపై నెలకొన్న అనిశ్చితి, కౌన్సెలింగ్‌ ప్రక్రియలో కొనసాగుతున్న జాప్యంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

* కీలక సూత్రధారి అరెస్టు

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ కేసులో పరారీలో ఉన్న కీలక సూత్రధారుల్లో ఒకరైన రాకీ అలియాస్‌ రాకేశ్‌ రంజన్‌ను జులై 11న సీబీఐ అధికారులు పట్నాలో అరెస్టు చేశారు. 


 

The center has revealed that there is no evidence of malpractices in the NEET (UG) examination, there is no need to re-conduct the examination and counseling will be started in the third week of July. An additional affidavit has been submitted to the Supreme Court to this effect. In this context, the hearing scheduled to be held in the Supreme Court on July 11 has been postponed to July 18. A bench headed by Chief Justice Justice DY Chandrachud revealed that copies of the affidavits filed by the Center and the National Testing Agency (NTA) have not yet been received by some of the parties, hence the adjournment. The judges decided to adjourn the initial hearing to July 15. However, after Solicitor General Tushar Mehta said that he and the Attorney General will not be available on that day, he said that arguments will be heard on July 11. On this occasion, the bench said that the CBI, which is investigating the irregularities in the examination, has submitted a permanent report regarding the progress of the investigation. On July 10, the Center filed an additional affidavit with the report given by IIT Madras analyzing the NEET (UG)-2024 exam result data. It said that the report nowhere mentions any irregularities. It said that the counseling process will start from the third week of July and will be conducted in four rounds. NTA has filed a separate affidavit. It said that an analysis was done on the marks at the national, state and city level and no abnormal levels were found anywhere.

On July 11, the NEET candidates met Union Education Minister Dharmendra Pradhan at his residence. On this occasion, the students expressed concern over the uncertainty over the examination and the ongoing delay in the counseling process.

* Arrest of key mastermind

Rocky alias Rakesh Ranjan, one of the fugitive key masterminds in the NEET question paper leak case, was arrested by CBI officials in Patna on July 11.

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.