Ammaku vandanam: ‘అమ్మకు వందనం’ పథకం * ఈ సర్టిఫికెట్‌ ఉంటేనే ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం * తాజాగా ఉత్తర్వులు జారీ

The government has suggested that students studying from I to Intermediate in the state should have Aadhaar to get the benefits of 'Ammaku Vandanam' and 'Student Kit' and if not, they should apply for registration. It has been revealed that 10 types of documents will be considered until Aadhaar is available. To this extent, the Secretary of the School Education Department Kona Sashidhar has issued an order. Under Ammaku Vandanam scheme, financial assistance of Rs.15 thousand per year will be given to mothers or guardians who are below the poverty line and send their children to schools. 75% attendance is mandatory for students. Under the student kit, students studying in government and aided schools are given a bag, three pairs of uniform clothes, a belt, a pair of shoes, two pairs of socks, text books, note books, work books and an English dictionary. Aadhaar is required to avail benefit under both these schemes. If anyone does not have it, it is suggested to provide Aadhaar registration facility through the Education Department. Until Aadhaar comes, voter identity card, employment scheme card, kisan passbook, ration card, passport, bank or postal passbook, driving license, document signed by gazetted officer verifying the person, document issued by tehsildar, any document prescribed by the department will be allowed. 


 

 రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదివే విద్యార్థులు ‘అమ్మకు వందనం’, ‘స్టూడెంట్‌ కిట్‌’ ప్రయోజనాలు పొందడానికి ఆధార్‌ కలిగి ఉండాలని, ఒకవేళ లేకపోతే నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆధార్‌ వచ్చే వరకు 10 రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అమ్మకు వందనం పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, పాఠశాలలకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం చేయనున్నారు. విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. స్టూడెంట్‌ కిట్‌ కింద ప్రభుత్వ, ఎయిడెడ్‌ బడుల్లో చదివే విద్యార్థులకు బ్యాగ్, మూడు జతల ఏకరూప దుస్తులు, బెల్టు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్‌ బుక్‌లు, ఆంగ్ల నిఘంటువు ఇస్తున్నారు. ఈ రెండు పథకాల కింద ప్రయోజనం పొందేందుకు ఆధార్‌ను కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరికైనా లేకపోయినా.. విద్యాశాఖ ద్వారా ఆధార్‌ నమోదు సదుపాయాన్ని కల్పించాలని సూచించారు. ఆధార్‌ వచ్చే వరకు ఓటరు గుర్తింపు కార్డు, ఉపాధి పథకం కార్డు, కిసాన్‌ పాస్‌బుక్, రేషన్‌ కార్డు, పాస్‌పోర్టు, బ్యాంకు లేదా తపాలా పాస్‌బుక్, డ్రైవింగ్‌ లైసెన్సు, వ్యక్తిని ధ్రువీకరిస్తూ గెజిటెడ్‌ అధికారి సంతకం చేసిన పత్రం, తహసీల్దారు ఇచ్చే పత్రం, విభాగం సూచించే ఏ పత్రాన్నైనా అనుమతిస్తారని వెల్లడించారు.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.