31, జులై 2024, బుధవారం

Army: ఆర్మీ నర్సింగ్‌ కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సు

Army: ఆర్మీ నర్సింగ్‌ కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సు 

భారత సైన్యం... 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న అయిదు కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆఫ్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (ఏఎఫ్‌ఎంఎస్‌)లో ప్రారంభమయ్యే నాలుగేళ్ల బీఎస్సీ(నర్సింగ్) కోర్సులో ప్రవేశానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కోర్సు- సీట్ల వివరాలు:
* నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ (ఫిమేల్‌): 220 సీట్లు
ఏఎఫ్‌ఎంఎస్‌, సీట్లు: కాలేజ్ ఆఫ్ నర్సింగ్, పుణె- 40, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, కోల్‌కతా- 30, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ముంబయి- 40, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, లఖ్‌నవూ- 40, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బెంగళూరు- 40.
అర్హత: అవివాహిత/ విడాకులు తీసుకున్న/ చట్టబద్ధంగా విడిపోయిన/ వితంతువులైన మహిళా అభ్యర్థులు అర్హులు. కనీసం 50% మార్కులు సీనియర్ సెకండరీ పరీక్ష 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్). నీట్‌ (యూజీ) 2024లో అర్హత సాధించి ఉండాలి. కనిష్ఠ ఎత్తు 152 సెం.మీ. కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01-10-1999 నుంచి 30-09-2007 మధ్య జన్మించిన వారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: నీట్ 2024 స్కోరు, జనరల్ ఇంటెలిజెన్స్/ జనరల్ ఇంగ్లిష్‌ టెస్ట్, సైకలాజికల్ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వార దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యాంశాలు:
* దేశవ్యాప్తంగా నెలకొన్న 5 కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆఫ్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశ నోటిఫికేషన్‌ వెలువడింది. 
* అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 
* అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
* నీట్ 2024 స్కోరుతో పాటు ఇతర పరీక్షల ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

Official Website

Online Application


 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు లేవు: