భిలాయ్ స్టీల్ ప్లాంట్ నుండి ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం Invitation of applications for jobs from Bhilai Steel Plant
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఆధ్వర్యంలోని భిలాయ్ స్టీల్ ప్లాంట్ (బీఎస్పీ) 45 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన చేసింది ఆన్లైన్లో దరఖాస్తు చేసు కోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో సీనియర్ మెడికల్ ఆఫీ సర్/ కన్సల్టెంట్- 10, మెడికల్ ఆఫీసర్-1, ఆసి స్టెంట్ మేనేజర్-3 పోస్టులు ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ లేటగిరీలో మైన్సో ్పర్మ్యాన్-శి, జూనియర్ ఇంజినీరింగ్ అసోసియేట్ (ఎలక్ట్రికల్ సూపర్వైజర్) -14, టెక్నికల్ అసోసి యేట్ (బాయిలర్ ఆపరేషన్)-5 ఉద్యోగాలు ఉన్నాయి.
1. మైన్స్ ఫోర్మేన్-3: మెట్రిక్యులేషన్, ఫుల్టైమ్ మైనింగ్ డిప్లొమా పాసవ్వాలి, మైన్స్ పోర్మెన్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపెటెన్సీ, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి. గనుల్లో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి.
2. జూనియర్ ఇంజినీరింగ్ అసోసియేట్ (ఎలక్ట్రికల్ సూపర్వైజర్) ఫర్ మైన్స్- 14: మెట్రిక్యులేషన్, ఎలక్ట్రి కల్ ఇంజినీరింగ్ డిప్లొమా పాసవ్వాలి. ఎలక్ట్రికల్ సూపర్వై జరీ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ ఉండాలి. చత్తీస్ గడ్/ మధ్య ప్రదేశ్ దేశవ్యాప్తంగా పనిచేయడానికి వ్యాలిడిటీ ఉండాలి.
3. టెక్నికల్ అసోసియేట్ (బాయిలర్ ఆపరేషన్) - 5: మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడ్లో పుల్టైమ్ ఐటీఐ పాసవ్వాలి. సెకండ్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ సర్టిపికెట్ ఆఫ్ కాంపిటెన్సీ ఉండాలి..
ఈ మూడు పోస్టులకూ అభ్యర్థుల వయసు 28 సంవత్స రాలు మించకూడదు. గరిష్ట వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్మెను మూడేళ్లు, డిపార్ట్మెంటల్ అభ్యర్ధులకు పది నుంచి పదిహేడేళ్ల మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: మైన్స్ పోర్మ్యాన్, జూనియర్ ఇంజినీ రింగ్ అసోసియేట్ పోస్టులకు యూఆర్/ఓబీసీ(ఎన్సీఎల్)/ ఈడబ్ల్యూఎస్లకు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఈ ఎస్ఎం/ డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు రూ.150.
* టెక్నికల్ అసోసియేట్ పోస్టుకు యూజర్/ ఓబీసీ(ఎన్సీఎల్)/ ఈడబ్ల్యూఎస్లకు రూ.300 ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం/ డిపార్ట్మెంటల్ అభ్యర్థు లకు రూ.100.
శారీరక ప్రమాణాలు: నాన్ఎగ్జిక్యూటివ్ కేటగిరికి చెందిన పురుషులు 155 సెం.మీ. ఎత్తు, 45 కిలోల బరువు ఉండాలి. చాతీ 75-79 సెం.మీ ఉండాలి. మహిళలు 143 సెం.మీ. ఎత్తు, 35 కిలోలు బరువు ఉండాలి.
సీబీటీ... స్కిల్ టెస్ట్
మైన్స్ పోర్మేన్/ జూనియర్ ఇంజనీరింగ్ అసోసియేట్ (ఎలక్ట్రికల్ సూపర్వైజర్/ టెక్ని కల్ అసోసియేట్ (బాయిలర్ ఆపరేషన్) పోస్టులకు అర్హులైన అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఆన్లైన్ టెస్ట్ నిర్వ హిస్తారు. ఈ సమాచారాన్ని అడ్మిట్ కార్డ్ ద్వారా తెలియజేస్తారు. సీబీటీలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ ఉంటుంది.
* సీబీటీలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు మల్టిపుల్ వాయిస్ విధానంలో ఉంటాయి. సంస్థ నిర్ణ యించిన పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు.
* ఆర్రిజర్వుడ్ ఈడబ్ల్యూఎస్లు 50 శాతం, ఎస్సీ/ ఎస్ట్/ఓబీసీ (ఎన్ సీఎల్)/ పీడ బ్ల్యూబీ అభ్యర్థులు 40 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి.
• సీబీటీలో అర్హత సాధించినవారికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. దీన్ని ఎప్పుడు నిర్వహించేదీ కాల్ లెటర్ ద్వారా తెలియజేస్తారు. వీటిని వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఈ సమాచారాన్ని అభ్యర్థుల ఈమెయిల్కు తెలి. యజేస్తారు. స్కిల్ టెస్ట్ అనేది అర్హత పరీక్ష మాత్రమే. దీంట్లో పాసైనవారిని 13 నిష్ప త్తిలో ఎంపికచేసి షార్ట్ లిస్టును తయారుచే స్తారు. సీబీటీలో సాదించిన మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా అభ్యర్థుల తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: 03:08. 2024
Website: www.sail.co.in
కామెంట్‌లు