GDS POSTAL JOBS: తపాలా శాఖలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు GDS POSTAL JOBS: 44,228 Gramin Dak Sevak Vacancies in Postal Department
GDS POSTAL JOBS: తపాలా శాఖలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు
Vacancy Details
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 44,228 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన(నోటిఫికేషన్ నంబర్ 17-03/2024) వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈనియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.పది వేల నుంచి రూ.పన్నెండు వేల ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 5 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్‌లో 1,355, తెలంగాణలో 981 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి.
ఖాళీల వివరాలు...........
* గ్రామీణ డాక్ సేవక్స్- బ్రాంచ్ పోస్టు మాస్టర్/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్/ డాక్ సేవక్: 44,228 పోస్టులు
సర్కిల్ వారీగా ఖాళీలు:
1. ఆంధ్రప్రదేశ్- 1355
2. అస్సాం- 896
3. బిహార్- 2558
4. ఛత్తీస్‌గఢ్- 1338
5. దిల్లీ - 22
6. గుజరాత్- 2034
7. హరియాణా- 241
8. హిమాచల్‌ప్రదేశ్- 708
9. జమ్మూ అండ్ కశ్మీర్- 442
10. జార్ఖండ్- 2104
11. కర్ణాటక- 1940
12. కేరళ- 2433
13. మధ్యప్రదేశ్- 4011
14. మహారాష్ట్ర- 3170
15. నార్త్ ఈస్ట్రన్- 2255
16. ఒడిశా- 2477
17. పంజాబ్- 387
18. రాజస్థాన్- 2718
19. తమిళనాడు- 3789
20. తెలంగాణ- 981
21. ఉత్తర్ ప్రదేశ్- 4588
22. ఉత్తరాఖండ్- 1238
23. పశ్చిమ్ బెంగాల్- 2543
మొత్తం ఖాళీల సంఖ్య: 44,228.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.
వయసు: 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
జీత భత్యాలు: నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380; ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది.
ఎంపిక విధానం: అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం నియామకాలు చేపడతారు. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్‌డ్/ అన్ రిజర్వ్‌డ్ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదానికి ఆప్షన్ 1 తర్వాత దానికి ఆప్షన్ 2... ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్ కేటాయిస్తారు. ఎంపికైన వారికి సమాచారం ఎస్‌ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా అందుతుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.వంద చెల్లించాలి.
బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం): ఈ పోస్టుకు ఎంపికైనవారు సంబంధిత బ్రాంచ్ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూసుకోవాలి. తపాలాకు సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలూ చక్కబెట్టాలి. బృంద నాయకుడిగా సంబంధిత బ్రాంచ్‌ను నడిపించాలి. పోస్టల్ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్(ఏబీపీఎం): ఈ ఉద్యోగంలో చేరినవాళ్లు స్టాంపులు/ స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూడటం, ఇండియన్ పోస్టు పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, ఇతర లావాదేవీలు చక్కబెట్టాలి. బ్రాంచ్ పోస్టుమాస్టర్ నిర్దేశించిన పనులు పూర్తి చేయాలి. వివిధ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి.
డాక్ సేవక్: ఈ విధుల్లో చేరినవారు ఉత్తరాలు పంపిణీ చేయాలి. అలాగే స్టాంపులు/ స్టేషనరీ అమ్మకాలు చేయాలి. బీపీఎం, ఏబీపీఎం సూచించిన పనులు పూర్తిచేయాలి. రైల్వే మెయిల్ సర్వీస్, పోస్టల్ పేమెంట్ బ్యాంకు విధులు చూసుకోవాలి. పోస్టల్ పథకాలు ప్రచారం చేయాలి.
దరఖాస్తు విధానం: దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15.07.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 05.08.2024.
దరఖాస్తు సవరణలకు అవకాశం: 06.08.2024 నుంచి 08.08.2024 వరకు.
Details need for AP POSTAL JOBS WITH 10TH CLASS BASE | 10వ తరగతి అర్హతతో AP పోస్టల్ ఉద్యోగాల కోసం అవసరమైన వివరాలు
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్‌లు