APTET 2024: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జులై-2024 వివరాలు...
APTET 2024: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జులై-2024
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పాఠశాల విద్యాశాఖ 'ఉపాధ్యాయ అర్హత పరీక్ష' (ఏపీ టెట్ జులై-2024) ప్రకటనను విడుదల చేసింది. దీనికి ఉపాధ్యాయ నియామక పరీక్షలో 20% వెయిటేజీ కూడా ఉంది. పేపర్-1ఏ ఎస్జీటీ టీచర్లకు, పేపర్-1బీ ప్రత్యేక విద్య ఎస్జీటీ టీచర్లకు నిర్వహించనున్నారు. పేపర్-2ఏ స్కూల్ అసిస్టెంట్లకు, పేపర్-2బీ ప్రత్యేక విద్య స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లకు ప్రత్యేకంగా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు 1-5 తరగతుల బోధనకు పేపర్-1(ఎ, బి); 6-8 తరగతుల బోధనకు పేపర్-2(ఎ, బి)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అర్హులైన వారు జులై 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షలు ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. టెట్ స్కోర్‌కు జీవిత కాల గుర్తింపు ఉంటుంది.
పరీక్ష వివరాలు...
* ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జులై-2024
అర్హతలు: పేపర్‌ను బట్టి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు డీఈడీ/ బీఈడీ/ లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమానం. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి ఏడాది చదివే అభ్యర్థులూ అర్హులే.
కమ్యూనిటీ వారీ ఉత్తీర్ణతా మార్కులు
1. ఓసీ(జనరల్)- 60% మార్కులు ఆపైన
2. బీసీ- 50% మార్కులు ఆపైన
3. ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్/ ఎక్స్ సర్వీస్‌మెన్- 40% మార్కులు ఆపైన
టెట్ ప్రశ్నపత్రాలు:
* పేపర్-1ఎ, పేపర్-1బి: 5 విభాగాల్లో 150 ప్రశ్నలు- 150 మార్కులకు నిర్వహిస్తారు.
* పేపర్-2ఎ, పేపర్-2బి: 4 విభాగాల్లో మొత్తం 150 ప్రశ్నలు- 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)గా నిర్వహిస్తారు. రోజుకు రెండు సెషన్లలో ఉంటుంది. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది.
పరీక్ష రుసుము: రూ.750.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
ముఖ్య తేదీలు:
నోటిఫికేషన్ విడుదల: 02/07/2024.
దరఖాస్తు రుసుములు చెల్లింపులు: 03/07/2024 నుంచి 16/07/2024 వరకు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ: 04/07/2024 నుంచి 17/07/2024 వరకు.
ఆన్‌లైన్ మాక్ టెస్ట్ సదుపాయం: 16/07/2024 నుంచి.
హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్: 25/07/2024 నుంచి.
పరీక్షల నిర్వహణ: 05/08/2024 నుంచి 20/08/2024 వరకు.
ప్రాథమిక ‘కీ’ విడుదల: 10/08/2024.
అభ్యంతరాల స్వీకరణ: 11/08/2024 నుంచి 21/08/2024 వరకు.
తుది ‘కీ’ విడుదల: 25/08/2024.
ఫలితాల ప్రకటన: 30/08/2024.
పరీక్ష సమయం:
సెషన్-1: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.
సెషన్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు.
Important Links
Posted Date: 02-07-2024
AP TET 2024 Notification
Click Here https://aptet.apcfss.in/Documents/AP_TET_JULY_2024_Notification.pdf
AP TET Information Bulletin https://aptet.apcfss.in/Documents/Information_Bulletin_2024_New.pdf
Click Here
AP TET Schedule
Click Here https://aptet.apcfss.in/Documents/Schedule_2024_new.pdf
AP TET Syllabus
Click Here https://aptet.apcfss.in/Documents/TET_SYLLABUS_2024_NEW.pdf
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్‌లు