పెన్షనర్లకు ఊరట: డోర్ స్టెప్ సేవలు, ఇంటివద్దే లైఫ్ సర్టిఫికెట్ Jeevan Pramaan Life Certificate
రిటైర్మెంట్ అనంతరం పెన్షన్ పొందడానికి పెన్షన్దారులు ప్రతి ఏడాది లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించవలసి ఉంటుంది. ప్రతి ఏడాది నవంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీలోపు దీనిని పూర్తి చేయాలి. ఎనభై ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇందుకు సంబంధించి ఓ వెసులుబాటు ఇచ్చింది. అక్టోబర్ 1వ తేదీ నుండి పెన్షన్ సర్టిఫికెట్ సమర్పించే వెసులుబాటును కల్పించింది. అంటే ఎనభై ఏళ్లు దాటినవారు అక్టోబర్ 1 నుండి నవంబర్ 30వ తేదీ మధ్య ఈ డాక్యుమెంట్స్ సమర్పించవచ్చు. వీటిని గతంలో స్వయంగా బ్యాంకు లేదా పోస్టాఫీస్లో చెల్లించవలసి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ లైఫ్ సర్టిఫికెట్స్ను ఇంటి నుండి సమర్పించవచ్చు.
ఒక
వేళ మీరు హిందూపురం ప్రాంత వాసులైతే స్వయంగా జెమిని ఇంటర్ నెట్ కు వచ్చి
లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు వేలి ముద్ర ద్వారా రూ.50/- అలాగే కంటి
ముద్ర ద్వారా రూ.100/- వస్తూలు చేయబడుతుంది.
ఇది ప్రయోజనకరం
డిజిటల్ లైప్ సర్టిఫికెట్ ఒక బయోమెట్రిక్ ఆధారిత డిజిటల్ సర్వీస్. ఇతర ప్రాంతాల్లో లేదా దూరంగా ఉన్న పెన్షన్దారులు ప్రతి ఏడాది పెన్షన్ ఏజెన్సీకి వచ్చి ఈ సర్టిఫికెట్ పొందడం కష్టంగా మారుతోంది. ముఖ్యంగా వృద్ధులకు ఇది వ్యయప్రయాసలతో కూడుకున్నది. ఈ సమస్యను పరిష్కరించేందుకే ప్రభుత్వం 2014లో జీవన్ ప్రమాణ్ పేరుతో సర్టిఫికెట్ జారీ చేసేందుకు డిజిటల్ విధానాన్ని అమలులోకి తీసుకు వచ్చింది. దీంతో వారు హోంబ్రాంచీకి వెళ్లవలసిన అవసరం లేకుండా బయోమెట్రిక్ ద్వారా సర్టిఫికెట్ పొందవచ్చు. అథెంటికేషన్ పూర్తైన తర్వాత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ జనరేట్ అవతుంది. దీనిని పెన్షన్ ఏజెన్సీలు నిల్వ చేస్తాయి.
ఈ ప్రాసెస్ పూర్తి చేయడానికి ఫింగర్ ప్రింట్ స్కాన్ చేయాలి. అయితే మీ వద్ద స్కానర్ లేదా కంప్యూటర్, మొబైల్ వంటి అవసనమైన పరికరాలు లేకుంటే సిటిజన్ సర్వీస్ సెంటర్(CSC) లేదా పోస్టాఫీస్, బ్యాంకు బ్రాంచీలకు వెళ్లి అసవరమైన వివరాలను అందించి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందాలి. ప్రభుత్వరంగ బ్యాంకులు, పోస్టాఫీస్లు ఇప్పటికే పలు రకాల డోర్ స్టెప్ సేవలు అందిస్తుననాయి. ఇప్పుడు పెన్షనర్లకు కూడా లైఫ్ సర్టిఫికెట్ను ఇంటి వద్దకే అందుబాటులోకి తీసుకు వచ్చింది. పోస్టాఫీస్లకు వెళ్లలేని వారికి ఇది ప్రయోజనకరం.
ఒక
వేళ మీరు హిందూపురం ప్రాంత వాసులైతే స్వయంగా జెమిని ఇంటర్ నెట్ కు వచ్చి
లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు వేలి ముద్ర ద్వారా రూ.50/- అలాగే కంటి
ముద్ర ద్వారా రూ.100/- వస్తూలు చేయబడుతుంది.
ఇలా సమర్పించాలి
- లైఫ్ సర్టిఫికెట్ డొర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు పొందడానికి మొదట Doorstep Banking యాప్ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
- మీ బ్యాంకును సెలక్ట్ చేసుకోవాలి. లైఫ్ సర్టిఫికెట్ సేవల డోర్ స్టెప్ సర్వీస్ కోసం విజ్ఞప్తి చేయాలి.
- మీ పెన్షన్ అకౌంట్ నెంబర్ను ఎంటర్ చేసి, ఆ తర్వాత వెరిఫై చేయాలి.
- అక్కడ డోర్ స్టెప్ ఛార్జీలను సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. నామినల్ ఫీజును చెల్లించడం ద్వారా ఈ సేవలు పొందవచ్చు.
- మీరు విజ్ఞప్తి చేసిన తర్వాత, ఏజెంట్ పేరును పేర్కొంటూ మీకు సందేశం వస్తుంది.
- సదరు బ్యాంకు ఏజెంట్ మీ చిరునామాకు వస్తారు. అక్కడ లైఫ్ సర్టిఫికెట్ సబ్మిషన్ ప్రాసెస్ పూర్తి చేస్తారు.
ఒక
వేళ మీరు హిందూపురం ప్రాంత వాసులైతే స్వయంగా జెమిని ఇంటర్ నెట్ కు వచ్చి
లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు వేలి ముద్ర ద్వారా రూ.50/- అలాగే కంటి
ముద్ర ద్వారా రూ.100/- వస్తూలు చేయబడుతుంది.
పోస్ట్మాన్ ద్వారా..
పెన్షన్దారులు పోస్ట్ ఇన్ఫో మొబైల్ యాప్ లేదా ప్రభుత్వ వెబ్సైట్స్ ద్వారా డోర్స్టెప్ సేవల కోసం విజ్ఞప్తి చేయవచ్చు. పెన్షన్దారుల మొబైల్ నెంబరుకు వచ్చే ప్రమాణ్ ఐడి ద్వారా తక్షణమే సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. పెన్షన్ డిపార్మెంట్ వద్ద ఆటోమేటిక్గా లైఫ్ సర్టిఫికేట్ వివరాలు అప్డేట్ అవుతాయి. ఆధార్ ధృవీకరణతో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పేపర్-లెస్గా మీ ఇండికి వస్తుంది.
అవసరమైన డాక్యుమెంట్స్
1) పెన్షన్ ఐడీ
2) పెన్షన్ పేమెంట్ ఆర్డర్
3) పెన్షన్ డిస్బర్సింగ్ డిపార్టుమెంట్
4) బ్యాంకు అకౌంట్ వివరాలు
5) మొబైల్ నెంబర్ అండ్ ఈ-మెయిల్ ఐడీ
6) ఆధార్ నెంబర్
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ పెన్షన్దారులకు ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ సేవలకు రూ.70 చార్జీని వసూలు చేస్తారు.
ఒక వేళ మీరు హిందూపురం ప్రాంత వాసులైతే స్వయంగా జెమిని ఇంటర్ నెట్ కు వచ్చి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు వేలి ముద్ర ద్వారా రూ.50/- అలాగే కంటి ముద్ర ద్వారా రూ.100/- వస్తూలు చేయబడుతుంది.
కామెంట్‌లు