25, అక్టోబర్ 2021, సోమవారం

Scholarship Programmes: విద్యార్థులకు అలర్ట్.. నవంబర్ లో అప్లై చేసుకోవాల్సిన స్కాల‌ర్‌షిప్ ల వివరాలివే.. తెలుసుకోండి

ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు(Students) అండగా నిలించేందుకు అనేక సంస్థలు స్కాలర్ షిప్ లు (Scholarship) అందించి చదువుకోవడానికి ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో దరఖాస్తు చేసుకోవాల్సిన స్కాలర్ షిప్ ల వివరాలు..

Gemini Internet

కరోనా (Corona) కారణంగా అనేక మంది ఆర్థికంగా చితికిపోయారు. అనేక మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. చాలా మంది చిరు వ్యాపారులు లాక్ డౌన్ల (Lock Down) కారణంగా దెబ్బతిన్నారు. దీంతో అలాంటి వర్గాల ప్రజలు వారి పిల్లల చదువులకు(Education) ఖర్చు చేసేందుకు చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరి కొందరు విద్యార్థులు (Students) కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంతో పాటు పలు ప్రముఖ సంస్థలు అందించే స్కాలర్ షిప్ (Scholarship) లను సద్వినియోగం చేసుకుంటే ఫీజుల చెల్లింపు భారం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో అప్లై చేసుకోవాల్సిన పలు స్కాలర్ షిప్ ల వివరాలు ఇలా ఉన్నాయి.

1. STFC India Meritorious Scholarship Programme 2021: 
శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ(STFC) లిమిటెడ్ పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు అండగా నిలిచేందుకు స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ను ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల పిల్లలకు ఈ స్కాలర్ షిప్ ను అందించనున్నారు. టెన్త్, ఇంటర్ తర్వాత ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ అందించనున్నారు.
అర్హత: డిప్లొమా/ఐటీఐ/పాలిటెక్నిక్ కోర్సులు లేదా -గ్రాడ్యుయేషన్/ఇంజనీరింగ్ కోర్సుల్లో నమోదు చేసుకున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు చేసుకునే విద్యార్థులు టెన్త్, ఇంటర్ కోర్సుల్లో 60 శాతం మార్కులను సాధించి ఉండాలి.
-అభ్యర్థులు తప్పనిసరిగా కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ కుటుంబానికి చెందిన వారై ఉండాలి. వారి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. 4 లక్షల లోపు ఉండాలి. ఈ స్కాలర్ షిప్ కోసం విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: 15-11-2021
అప్లికేషన్ లింక్: www.b4s.in/it/SIMD4

స్కాలర్ షిప్: ఈ స్కాలర్ షిప్ కింద ఎంపికైన విద్యార్థులు ఐటీఐ/పాలిటెక్నిక్/డిప్లొమా కోర్సులకు గాను ఏడాదికి రూ. 15 వేలు, గ్రాడ్యుయేషన్/ఇంజనీరింగ్ కోర్సులకు ఏడాదికి రూ. 35 వేల చొప్పున స్కారల్ షిప్ ను పొందుతారు.
Scholarship : అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోండి.. విద్యార్థుల‌కు బెస్ట్ స్కాల‌ర్‌షిప్ ప్రొగ్రాంలు

2. IIT Roorkee Chemistry Department Post Doctoral Fellowship (PDF) 2021:
ఐఐటీ రూర్కీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ PhD చేసిన అభ్యర్థులకు స్కాలర్ షిప్ ను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులు ‘Chemical Proteomic Approach to Identify Snrall Molecule Covalent inhibitors to Target Protein-Protein Interactions in BCI-2 Proteitrs’ ప్రాజెక్టుపై పని చేయాల్సి ఉంటుంది.
-కెమిస్ట్రీ (కెమికల్ బయాలజీ)/ బయోటెక్నాలజీ/ బయోకెమిస్ట్రీలో పీహెచ్‌డీ పట్టా పొందిన మరియు ఇటీవల తమ థీసిస్‌ను సమర్పించిన అభ్యర్థులు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవచ్చు.
స్కాలర్ షిప్ మొత్తం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 60 వేల చొప్పున స్కాలర్ షిప్ అందించనున్నారు.
చివరి తేదీ: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 6వ తేదీలోగా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Application mode: అభ్యర్థులు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆఫ్ లైన్ అప్లికేషన్లను The Head Department of chemistry, India Institute of Technology Roorkee Roorkee- 247667 Uttarakhand, India చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. లేదా venkatesh.v@cy.iitr.ac.in మెయిల్ కు పంపించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ లింక్: https://www.iitr.ac.in/administration/uploads/File/ch/2021/adv07102021.pdf

3. Ericsson Empowering Girl Scholarship Programme 2021:
ఎరిక్సన్ సంస్థ ప్రతిభ కలిగిన బాలికలకు చేయూత అందించేందుకు ఈ స్కాలర్ షిప్ ను తీసుకువచ్చింది. ఇంజనీరింగ్ సెకండియర్(IT/CS) చదివే అభ్యర్థులు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంబీఏ చేసే వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
అర్హత: ఐటీ/కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ చదువుతున్న వారు కూడ ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వార్షిక ఆదాయం ఏడాదికి రూ. 6 లక్షల లోపు ఉండాలి.

స్కాలర్ షిప్: ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన వారికి ఏడాదికి రూ. 75 వేల స్కాలర్ షిప్ అందించనున్నారు.
దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2021
అప్లికేషన్ డైరెక్ట్ లింక్: www.b4s.in/it/EEGS2


 

కామెంట్‌లు లేవు:

Recent

**🛑 NIOS Senior Executive Officer Recruitment** **🎓 Qualifications:** 1. **Senior Executive Officer (Instructor):** - Passed Class XII in any discipline - Diploma in Teaching Indian Sign Language (DTISL) or an equivalent course recognized by RCI - Proficiency in Indian Sign Language 2. **Senior Executive Officer (Interpreter):** - Passed Class XII in any discipline - Diploma in Indian Sign Language Interpreting (DISLI) or an equivalent course recognized by RCI - Proficiency in Indian Sign Language **📅 Last Date for Application Submission:** **21 days** from the date of notification issuance. **🛑 NIOS సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల నియామకం** **🎓 అర్హతలు:** 1. **సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇన్‌స్ట్రక్టర్):** - 12వ తరగతి ఉత్తీర్ణం - ఇండియన్ సైన్ లాంగ్వేజ్ టీచింగ్ డిప్లొమా (DTISL) లేదా RCI ద్వారా గుర్తించబడిన సమానమైన కోర్సు - ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో నైపుణ్యం 2. **సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇంటర్‌ప్రెటర్):** - 12వ తరగతి ఉత్తీర్ణం - ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటింగ్ డిప్లొమా (DISLI) లేదా RCI ద్వారా గుర్తించబడిన సమానమైన కోర్సు - ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో నైపుణ్యం **📅 దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ:** **21 రోజులు** (నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి)