AP
 EAMCET:  విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏపీ ఎంసెట్ 2021 
కౌన్సిలింగ్ తేదీలు విడుదలయ్యాయి. అక్టోబర్ 25, 2021 నుంచి ఏపీ ఎంసెట్ 
మొదటి దశ ప్రవేశాల కౌన్సిలెంగ్ ప్రారంభం కానుంది. ఈ కౌన్సిలింగ్ 
రిజిస్ట్రేషన్‌ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ 
(APSCHE) ప్రారంభిస్తుంది. (Exams) ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ కు (Exams) సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే apeamcet.nic.in
 లో విడుదల కానుందని విద్యార్థులు గమనించాలి. నివేదికల ప్రకారం, అధికారిక 
వర్గాలు ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలను 2021 అక్టోబర్ 21న ప్రెస్ 
కాన్ఫరెన్స్ లో విడుదల (Exams)
 చేశాయి. ఆ షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు (Exams) ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ 
రిజిస్ట్రేషన్‌ను అక్టోబర్ 30లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. నివేదికల 
ప్రకారం, నూతన విద్యా సంవత్సరం నవంబర్ 15, 2021న ప్రారంభించేందుకు తాజాగా 
అధికారులు షెడ్యూల్ విడుదల చేశారని తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు
 సురేష్ ఏపీ ఎంసెట్ 2021 కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించారు. సర్టిఫికెట్ 
వెరిఫికేషన్ ప్రక్రియ అనేది రిజిస్ట్రేషన్‌తో సమాంతరంగా జరుగుతుంది. 
విద్యార్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్ 
ఎంచుకోవచ్చు. అయితే, పూర్తి షెడ్యూల్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను 
ఏపీఎస్‌సీహెచ్‌ఈ ఇంకా ప్రకటించలేదు.
* ఏపీ ఎంసెట్ 2021 కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్
* అక్టోబర్ 25 నుంచి 30 వరకు రిజిస్ట్రేషన్లు, ఫీజు చెల్లింపుల ప్రక్రియ జరుగుతుంది.
* అక్టోబర్ 26 నుంచి 30 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది.
* నవంబర్ 1 నుంచి 5 వరకు వెబ్ ఆప్షన్ ఎంట్రీ (వెబ్ ఆప్షన్లకు)కి అవకాశం కల్పిస్తారు.
* ఫైనల్ సబ్మిషన్ కు నవంబర్ 1 నుంచి 6 వరకు సమయం ఉంటుంది. ఈ సమయంలో ముందస్తుగా సేవ్ చేసిన ఆప్షన్స్ లో మార్పులు చేయొచ్చు.
* నవంబర్ 10, 2021న సీట్లను కేటాయిస్తారు.
* నవంబర్ 10 నుంచి 15 వరకు విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీలకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
* అకడమిక్ సెషన్ నవంబర్ 15, 2021 ప్రారంభం అవుతుంది.
పైన పేర్కొన్న షెడ్యూల్స్ మొదటి దశకు సంబంధించింది కాగా.. అభ్యర్థుల అర్హత, వెబ్ ఆప్షన్ల ఎంపిక ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. మొదటి దశలో సీట్లు మిగిలిపోతే రెండో దశలో ర్యాంకుల ఆధారంగా అర్హులకు సీట్లు కేటాయిస్తారు.
  
  
కామెంట్‌లు