29, అక్టోబర్ 2021, శుక్రవారం

TTD Updates 🕉 *శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్ప‌ణ‌*


        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🕉 TTD News ™ తిరుపతి:
         శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు అక్టోబ‌రు 30న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణం నిర్వ‌హించ‌నున్నారు.

★ ఆలయంలో అక్టోబరు 31 నుండి న‌వంబ‌రు 2వ తేదీ వరకు ప‌విత్రోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి.
 కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తారు.

వైదిక సంప్రదాయం ప్రకారం
●జాతాశౌచం,
●మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం.
అయినా
యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసితెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

■ పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 31వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు.
■ రెండో రోజు నవంబరు 1వ తేదీన మధ్యాహ్నం 12.00 నుండి 1.00 గంట వరకు పవిత్ర సమర్పణ చేస్తారు.

■ చివరిరోజు నవంబరు 2వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

★ పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
👉 అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల‌కు ఆల‌యంలో ఆస్థానం జ‌రుగ‌నుంది.


🕉 *న‌వంబ‌రు నెల‌లో తిరుప‌తిలోని టిటిడి స్థానిక ఆల‌యాల్లో విశేష ఉత్సవాలు*
        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🕉 TTD News ™ తిరుపతి:
          తిరుపతి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీ కోదండరామాలయంలో న‌వంబ‌రు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.

★ వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ★

🕉 శరీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం…..

■– న‌వంబ‌రు 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం.

■– న‌వంబ‌రు 4న దీపావ‌ళి ఆస్థానం.

■– న‌వంబ‌రు 6న శ్రీ తిరుమ‌ల నంబి శాత్తుమొర.

■– న‌వంబ‌రు 8న శ్రీ మనవాళ మహాముని శాత్తుమొర.

■– నవంబరు 9న శ్రీ సేనై మొదలియార్ వర్ష తిరునక్షత్రం.

■– నవంబరు 10 నుండి 19వ తేదీ వ‌ర‌కు శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఉత్సవం.

■– న‌వంబరు 11వ తేదీ శ్రీ వేదాంతదేశికర్‌ శాత్తుమొర.

■– న‌వంబ‌రు 12న శ్రీ భూతాళ్వార్ వర్ష తిరునక్షత్రం.

■– న‌వంబ‌రు 13న శ్రీ పెరియాళ్వార్ వర్ష తిరునక్షత్రం.

■– నవంబరు 19న శ్రీ తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర.

■– న‌వంబ‌రు 16వ తేదీ కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం, పురాణ ప్ర‌వ‌చ‌నం నిర్వహిస్తారు.

■– నవంబరు 18న కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా కార్తీక దీప్పొత్స‌వం.

🕉 శ్రీ కోదండరామాలయంలో….

■– న‌వంబ‌రు 2న ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది.

■– న‌వంబ‌రు 4న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం,
సాయంత్రం 6 గంట‌ల‌కు దీపావ‌ళి ఆస్థానం నిర్వ‌హిస్తారు.

■– న‌వంబ‌రు 6, 13, 20, 27వ‌ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయంలో ఊరేగింపు, అనంతరం రాత్రి 7.00 గంటలకు ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

■– న‌వంబ‌రు 19న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.

■– న‌వంబ‌రు 24న పున‌ర్వ‌సు న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం నిర్వ‌హిస్తారు.


కామెంట్‌లు లేవు: