Alerts

Alerts from Blog Synchronized 40s Scrolling Alerts – Gemini Internet

23, అక్టోబర్ 2021, శనివారం

NFL Recruitment: NFL​​లో 183 నాన్ ఎగ్జిక్యూటివ్​ పోస్టులకు నోటిఫికేషన్.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) 183 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్​ 10లోపు వెబ్​సైట్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది

కేంద్ర ప్రభుత్వ రంగ (Union government sector) సంస్థ అయిన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (national fertilizers limited) 183 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టు (Non executive)ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్​ 10లోపు www.nationalfertilizers.com వెబ్​సైట్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. నవంబర్​ 10 సాయంత్రం 5.30లోపు దరఖాస్తు ఫీజు చెల్లించాలని తెలిపింది. ఈ నోటిఫికేషన్ (notification)​​ ద్వారా వివిధ విభాగాల్లో జూనియర్​ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (junior engineer assistant)​, లోకో అటెండెంట్ (Loco attendant)​, అటెండెంట్ (Attendant)​, మార్కెటింగ్​ పోస్టులను (marketing posts) భర్తీ చేస్తుంది. ఆన్​లైన్​ కంప్యూటర్​ బేస్ట్ పరీక్ష (Online computer based exam) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.

ఖాళీల వివరాలు

తాజా నోటిఫికేషన్​ ద్వారా మొత్తం 183 నాన్​ ఎగ్జిక్యూటివ్ (Non executive)​ పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో జూనియర్​ ఇంజినీర్​ ప్రొడక్షన్​ 87, ఇన్​స్ట్రుమెంటేషన్​ 15, ఎలక్ట్రికల్​ 7, లోకో అటెండెంట్​ 23, అటెండెంట్​ ఫిట్టర్ (Attendant fitter)​ 17, ఎలక్ట్రికల్​ అటెండెంట్​ 19, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ (marketing executive)​ 15 చొప్పున ఖాళీలున్నాయి.

అర్హత, వయోపరిమితి

దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులు (candidates) సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ (graduation), ఐటీఐ (ITI) లేదా డిప్లొమా (Diploma)లను పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2021 సెప్టెంబర్​ 30 నాటికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల (reservations) ప్రకారం ఆయా కేటగిరీ అభ్యర్థులకు (candidates) వయో సడలింపు ఉంటుంది.



జీత భత్యాలు

నాన్​ఎగ్జిక్యూటివ్​ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document verification) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి దాదాపు రూ. 20,000 నుంచి రూ. 50,000 మధ్య నెలవారీ జీతం అందుతుంది. అయితే, పోస్టులను బట్టి పే స్కేల్ (pay scale)​లో మార్పులు ఉంటాయి. జీతంతో పాటు అదనపు అలవెన్సులు కూడా లభిస్తాయి.

దరఖాస్తు ఫీజు

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్​ ఫీజు (Application fee) చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ (General)​, ఓబీసీ (OBC),ఈడబ్ల్యూఎస్​ (EWS) కేటగిరీ అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ (SC/ST) అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు (FEE)ను నవంబర్ 10 సాయంత్రం 5.30లోపు చెల్లించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్​కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం (Full detailes) ఎన్​ఎఫ్​ఎల్ (NFL)​ అధికారిక వెబ్​సైట్​ను సందర్శించండి.

www.nationalfertilizers.com

 

కామెంట్‌లు లేవు:

Recent

✅ *SSC GD Constable Correction/ Edit Form 2026* 👇

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...