Whatsapp: మీరు వాట్సాప్ వాడుతున్నారా..? అయితే ఇలా చేశారంటే మీ అకౌంట్ బ్లాకే..!
Whatsapp: ప్రస్తుతం చాలా మందికి స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. అందులో వాట్సాప్ లేనిది స్మార్ట్‌ఫోన్ అంటూ ఎక్కడ ఉండదు. ఒక పూట తిండి మానేస్తారేమోగాని వాట్సాప్ లేనిది..
Whatsapp: ప్రస్తుతం చాలా మందికి స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. అందులో వాట్సాప్ లేనిది స్మార్ట్‌ఫోన్ అంటూ ఎక్కడ ఉండదు. ఒక పూట తిండి మానేస్తారేమోగాని వాట్సాప్ లేనిది ఉండలేని పరిస్థితి నెలకొంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్క ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే వరకు చాటింగ్‌లు, స్టేటస్ ఇలా రకరకాలుగా వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. వాట్సాప్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటి.
ఇక వాట్సాప్ ఉంది కదా అని కొందరు ఇష్టానుసారంగా మెసేజ్‌లు చేస్తున్నారు. గ్రూపుల్లో అసభ్యకరమైన మెసేజ్‌లు, ఇతరులకు భంగం కలిగించే మెసేజ్‌లు చేస్తున్నారు. ఇలాంటి వారిపై వాట్సాప్ సంస్థ ప్రత్యేక నిఘా పెట్టింది. ఇతరులకు ఇబ్బంది కలిగించే మెసేజ్‌లపై నిఘా వేసింది. అలాంటి పోస్టులు పెట్టిన వారి అకౌంట్లను సైతం బ్లాక్ చేస్తోంది. అయితే అక్టోబర్ 4 న ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలను ఏడు గంటలపాటు నిలిచి పోయినా విషయం తెలిసిందే. అయితే వాట్సాప్‌ను సరిగ్గా వాడుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఒక వేళ వాట్సాప్‌కు భంగం కలిగించే మెసేజ్‌లు చేశారనుకోండి.. ఇక అంతే. మీ అకౌంట్ శాశ్వతంగా బ్లాక్ అయిపోతుంది. ఇలాంటి అకౌంట్లపై వాట్సాప్ కఠినంగా వ్యవహరిస్తోంది. వాట్సాప్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆయా యూజర్ల వాట్సాప్ ఖాతాలను తొలగించేస్తోంది. మీరు ఒక వేళ తెలిసి, తెలియాక వాట్సాప్‌కు విరుద్ధంగా చేశారంటే మీ అకౌంట్‌ను వాట్సాప్ బ్లాక్ చేస్తోంది.
ఈ యాప్‌లను కూడా వాడకూడదు..
వాట్సాప్‌కు బదులుగా ఇతర క్లోనింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. జీబీ వాట్సాప్, వాట్సాప్ ప్లస్, వాట్సాప్ మోడ్ యాప్‌లను ఉపయోగించే వారివి ఖాతాలను వాట్సాప్ తొలగిస్తుంది. ఈ థర్డ్‌పార్టీ యాప్స్‌తో యూజర్ల భద్రతకు, ప్రైవసీకి భంగం వాటిల్లితుంది. ఇలా థర్డ్‌పార్టీ యాప్స్‌పై కూడా కఠినంగా వ్యవహరిస్తోంది వాట్సాప్.
స్పామ్ మెసేజ్‌లను పంపితే అకౌంట్ బ్లాకే..
తెలియని నంబర్లకు స్పామ్‌మెసేజ్‌లను పంపినట్లయితే వెంటనే వాట్సాప్ సదరు వ్యక్తి అకౌంట్‌ను బ్లాక్ చేస్తోంది. ఆయా యూజర్లకు అనుమతి లేకుండా మెసేజ్‌లను పంపినట్లయితే ఇక అంతే సంగతి. ఇలాంటి విషయాలలో యూజర్లు జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతో మంచిది. ఇలాంటి యూజర్లపై ప్రతి నెల అనేక ఫిర్యాదులు వస్తుండటంతో వాట్సాప్ ప్రత్యేక నిఘా పెట్టి అట్టి అకౌంట్లను బ్లాక్ చేసేస్తోంది.
కామెంట్‌లు