25, అక్టోబర్ 2021, సోమవారం

Engineering Students: ఇంజినీరింగ్​ విద్యార్థులకు గుడ్​న్యూస్​.. ప్రతి నెలా రూ. 7500 స్టైపెండ్​ పొందే అవకాశం.. 31 అక్టోబర్ 2021 లోపు దరఖాస్తు చేసుకోవాలి.



Engineering Students: ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఇంటర్న్‌షిప్(Internship) 2021కింద ఇంజినీరింగ్​ విద్యార్థులకు తీపికబురు అందించింది. ఉజ్జ్వలా కెమికల్ అండ్ ఫెర్టిలైజర్‌ (Ujjawala Chemical and Fertilizers) లో 100 లాబరేటరీ ఇంటర్న్​ల భర్తీకి నోటిఫికేషన్ (Notification)​ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఇంటర్న్‌షిప్(Internship) 2021కింద ఇంజినీరింగ్​ విద్యార్థులకు తీపికబురు అందించింది. ఉజ్జ్వలా కెమికల్ అండ్ ఫెర్టిలైజర్‌ (Ujjawala Chemical and Fertilizers) లో 100 లాబరేటరీ ఇంటర్న్​ల భర్తీకి నోటిఫికేషన్ (Notification)​ విడుదల చేసింది. ఎంపికైన వారికి ఉజ్జ్వలా కెమికల్ అండ్ ఫెర్టిలైజర్‌లో 6 నెలల ల్యాబరేటరీ ఇంటర్న్​గా అవకాశం కల్పిస్తారు. ఇందులో మొత్తం 100 ల్యాబొరేటరీ ఇంటర్న్ స్థానాలకు ఖాళీలుండగా ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా రూ. 7500 స్టైపెండ్​ అందజేస్తారు. ఉజ్జ్వల కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ (Ujjawala Chemical and Fertilizers) అనేది ఒక విశ్వసనీయమైన తయారీదారీ, సరఫరాదారీ సంస్థ. ఇది జీవ ఎరువులు, సూక్ష్మ పోషకాల ఎరువులమొదలగు ఎరువుల వ్యాపారం నిర్వహిస్తోంది.

ఈ ఇంటర్న్‌షిప్ చేయడం ద్వారా అభ్యర్థులు నిజజీవిత వర్క్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. అంతేకాదు, నిపుణులతో పని చేస్తూ అనేక కొత్తవిషయాలు తెలుసుకోవచ్చు. ఫీల్డ్ లో ప్రయోగాలు కూడా చేయొచ్చు. మొత్తం ఆరు నెలల కాలం పాటు అందుబాటులో ఉండే ఈ ఇంటర్న్​షిప్​కు సెకండ్ లేదా థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విద్యార్థులు సంబంధిత స్కిల్స్ తో పాటు అనుభవం కలిగి ఉండాలి.

Gemini Internet

ఎంపికైన విద్యార్థులు ఉజ్జ్వల కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ సంస్థలో చేయాల్సిన పని
1. ఎరువులు, పురుగుమందులను విశ్లేషించాలి.
2. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్, ఎక్స్పెరిమెంట్స్ నిర్వహించాలి. అలాగే వీటికి సపోర్ట్ చేయాలి.
3. నియంత్రిత ప్రయోగాలను ప్లాన్ చేయాలి. ట్రయల్స్ చేపట్టాలి. ఈ ప్రయోగాలను ఏర్పాటు చేయాలి.
4. డేటాను రికార్డ్ చేయాలి. అలాగే విశ్లేషించాలి.
5. పరికరాలను శుభ్రపరచాలి, పరీక్షించాలి, కాలిబ్రేట్(calibrate) చేయాలి. పరికరాల శుభ్రంగా ఉన్నాయో లేదో పరీక్షించాలి.
6. సంబంధిత సైంటిఫిక్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకోవాలి.
7. వనరులను ఆర్డర్ చేయాలి.. అలాగే వాటిని మెయింటైన్ చేయాలి.
ఎఐసీటీఈ ఇంటర్న్‌షిప్ 2021కి దరఖాస్తు చేసుకోండిలా
ఆసక్తిగల విద్యార్థులు https://internship.aicte-india.org అధికారిక వెబ్‌సైట్‌లో 31 అక్టోబర్ 2021 లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు మొదటగా వారు చదువుతున్న యూనివర్సిటీపేరు, విద్యార్థి ఐడీ, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లతో తులిప్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వారి ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.

కామెంట్‌లు లేవు:

Recent

Work for Companies from Where you are...