PM Kisan: రైతులకు అలర్ట్.. వీరికి పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు రావు.. ఎందుకంటే..!
PM Kisan Samman Nidhi Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. వీటిలో రైతులకు ప్రత్యేక స్కీమ్ కూడా ఉంది. అదే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ పథకం ద్వారా ఎంతో మంది రైతులు ఆర్థికంగా లాభం పొందుతున్నారు. ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులకు వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున లభిస్తున్నాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి.
అయితే రైతులకు ఇప్పటికే 9 విడతల డబ్బులు అందాయి. ఇప్పుడు మోదీ సర్కార్ పదో విడత డబ్బులు జమ చేయడానికి రెడీ అవుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఈ పీఎం కిసాన్ స్కీమ్ కొంత మందికి వర్తించదు. డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్స్ వంటి వారికి పొలం ఉన్నా డబ్బులు అందవు. అలాగే ఆదాయపు పన్ను చెల్లించే వారికి కూడా భూమి ఉన్నా పీఎం కిసాన్ స్కీమ్ వర్తించదు. నెలకు రూ.10 వేలు లేదా ఆపైన పెన్షన్ తీసుకునే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్ ద్వారా డబ్బులు రావు. కొంత మందికి మాత్రం మినహాయింపు ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పదవిలో ఉన్నా లేదంటే మాజీ రాజకీయ నాయకులకు స్కీమ్ వర్తించదు. అలాగే అర్హత కలిగిన ఉండి బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు వంటి వాటిల్లో వివరాలు తప్పుగా ఉన్నా కూడా పీఎం కిసాన్ డబ్బులు రావని గుర్తించాలి. ఒకే ఇంట్లో భార్యాభర్తల పేరుపై పొలం ఉంటే కేవలం ఒకరికి మాత్రమే ఈ స్కీమ్ ద్వారా డబ్బులు అందుతాయి.
కాగా, ఈ స్కీమ్‌లో భాగంగా కేంద్రం రైతులకు ఏడాదికి రూ.6 వేలు అందిస్తోంది. ఇవి ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఏడాదికి మూడు విడతల్లో అంటే రూ.2 వేల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతాయి. ఇప్పుడు పదో విడత కింద రూ.2 వేలు అందనున్నాయి. అక్టోబర్ 31 వరకు పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు రైతులకు అందనున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. మరి ఈ నెల చివరి వరకు జమ అవుతాయా..? లేదా ముందే జమ అవుతాయా అనేది చూడాలి.
కామెంట్‌లు