డాక్టర్ వై ఎస్ ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ గురించిన సమాచారం | Dr.YSR Architecture and Fine Arts University Info.
మనసులోని భావాలకు దృశ్యరూపం ఇచ్చే అరుదైన కోర్సు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్‌ఆర్ట్స్‌లోని యానిమేషన్ కోర్సు. పెద్ద నగరాలకే పరిమితమైన ఈ కోర్సు డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో అందుబాటులోకి వచ్చింది. 100 శాతం ఉపాధి, ఉద్యోగ అవకాశాలున్న ఈ కోర్సు ప్రత్యేకతలపై కథనం.
సాక్షి,కడప(వైవీయూ): కడప నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి స్పెషలైజ్డ్ యూనివర్సిటీ డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ విశ్వవిద్యాలయం. వందశాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండే కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పెద్ద నగరాలకే పరిమితమైన యానిమేషన్ కోర్సును బీఎఫ్‌ఏ యానిమేషన్ కోర్సుగా కడప విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం, భవిష్యత్ అవసరాలను తీర్చేవిధంగా తీర్చిదిద్దిన ఈ కోర్సు పూర్తి చేయడం ద్వారా సొంతగా, వివిధ సంస్థల్లో పనిచేసి పేరుప్రఖ్యాతులు, ఆకర్షణీయమైన వేతనాలు పొందవచ్చును.
అర్హత : ఇంటర్మీడియట్‌లో ఏదైనా కోర్సు పూర్తిచేసిన ఇందులో చేరడానికి అర్హులు. ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2021 ద్వారా ప్రవేశాలు పొందచ్చు. నాలుగు సంవత్సరాల ఈ కోర్సుకు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఓపెన్ ఇంటర్ ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులే. కోర్సులో ప్రవేశం పొందిన వారికి వివిధ రకాల సాంకేతికతను వినియోగించి ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతారు.
అవకాశాల వెల్లువ..
ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు వివిధ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయన్నది నిపుణుల మాట. చదువకుంటూ వివిధ సంస్థల్లో ఫ్రీలాన్స్‌గా కూడా ఉద్యోగం చేసుకునే సౌకర్యం ఉంది. ఆన్‌లైన్ ద్వారా గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్, ఫిల్మ్‌మేకింగ్, గేమ్ డిజైనింగ్ ప్రోగ్రామింగ్ చేసే అవకాశాలు లభిస్తాయి. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు యానిమేషన్, గేమ్ డిజైనింగ్, కార్టూన్, టీవీఛానల్స్, బుక్ మేగజైన్స్, వెబ్ మాధ్యమాల్లో అపారంగా అవకాశాలు ఉన్నాయి.
2డీ, 3డీ యానిమేటర్‌లుగాను, లైటింగ్, రిగ్గింగ్
ఆర్టిస్ట్‌గాను, కేరక్టర్ డిజైనర్‌గాను, స్క్రిప్ట్ రైటర్, వీడియో, ఆడియో
ఎడిటర్‌గా, పోస్ట్ ప్రొడక్షన్‌లో వీఎఫ్‌ఎక్స్ ఆర్టిస్ట్, డిజైనర్‌గా,
గ్రాఫిక్ డిజైనర్, టాయ్ యానిమేటర్, స్టోరీబోర్డు ఆర్టిస్టుగా,
ఇలస్ట్రేటర్‌గా, టైటిల్ డిజైనర్, కంపోస్టర్, విజువల్ డెవలపర్,
ఫ్లాష్‌న్యూస్‌మేకర్స్, ప్రొడక్షన్ డిజైనర్, లేఅవుట్ ఆర్టిస్ట్, 3డీ
మోడులర్, కీ ప్రైమ్ యానిమేటర్, ఇమేజ్ ఎడిటర్‌గా, ఫోరెన్సిక్ యానిమేటర్
వంటి వివిధ రకాల ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. MPC స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన లేదా డిప్లొమా ఉన్న వారికి EAPCET ద్వారా ప్రవేశాలు ఉంటాయి. ఈ సంస్థలో మొత్తం 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి, వీటిలో 15 మేనేజ్‌మెంట్ కోటా కింద ఉన్నాయి. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్, drysrafu.ac.in సందర్శించడం ద్వారా మరింత తెలుసుకోవచ్చు.
Gemini Internet
కామెంట్‌లు