ఈ ప్రక్రియ ఫలితాలు నవంబర్ 3న విడుదలవుతాయి.రాష్ట్ర
 నీట్ పీజీ కోటా సీట్ల కోసం కౌన్సెలింగ్‌ను సంబంధిత రాష్ట్ర వైద్య 
కౌన్సెలింగ్ కమిటీలు నిర్వహిస్తాయని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ 
ప్రకటించింది. 50 శాతం ఆల్ ఇండియా కోటా, డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీలు,
 ఏఎఫ్‌ఎంఎస్ (ఎండీ/ఎంఎస్/డిపొ్లమా/పీజీ డీఎన్‌బీ) సీట్ల భర్తీకి నీట్ 
పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహించనుంది.
 కాగా డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీ సీట్లు, పీజీ డీఎన్‌బీ సీట్ల 
ప్రవేశానికి అదనపు మోప్–అప్ రౌండ్ నిర్వహించనున్నారు. ఆఖరున మిగిలిన 
సీట్ల కోసం ప్రత్యేకంగా మరో రౌండ్ కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. 
 జాతీయ
 అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) పీజీ–2021 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను మెడికల్
 కౌన్సిలింగ్ కమిటీ(ఎంసీసీ) శుక్రవారం విడుదల చేసింది. మొదటి రౌండ్ 
కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈనెల 25 నుంచి 
29 వరకు జరుగనుంది. రెండో రౌండ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ నవంబర్
 15 నుంచి 19 వరకు ఉంటుంది. మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ నవంబర్
 1, 2 తేదీల్లో జరుగుతుంది.  
కామెంట్‌లు