HDFC Scholarship : రూ.75,000 స్కాల‌ర్‌షిప్ పొందే అవ‌కాశం.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు

క‌రోనా మహమ్మారి (Covid-19 pandemic) కారణంగా దెబ్బ‌తిన్న కుటుంబాల విద్యార్థుల‌కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చేయూత‌నందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప‌రివ‌ర్త‌న్ కోవిడ్ క్రైసిస్ స‌పోర్ట్ స్కాల‌ర్‌షిప్ పేరుతో విద్యార్థుల‌కు రూ.75,000 అందించ‌నుంది. కరోనా కార‌ణంగా చ‌దువుకోవ‌డానికి ఇబ్బంది ప‌డుతున్న వారికి ఇది చ‌క్క‌ని అవ‌కాశం. ఈ స్కాల‌ర్‌షిప్ ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి అక్టోబ‌ర్ 31, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది

కరోనా మహమ్మారి (Covid-19 pandemic)కారణంగా వేలాది మంది పిల్లలు నిరాశ్రయులయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారి చదువు, భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అటువంటి పిల్లలకు హెచ్‌డీఎఫ్‌సీ చేయూత నందిస్తోంది. వారికి కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) ప‌రివ‌ర్త‌న్ కోవిడ్ క్రైసిస్ స‌పోర్ట్ స్కాల‌ర్‌షిప్‌ను ప్ర‌వేశ పెట్టింది. క‌రోనా కార‌ణంగా త‌ల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారు. జీవ‌నోపాధి కోల్పోయిన కుటంబ విద్యార్థ‌లుకు ఈ స్కాల‌ర్‌షిప్‌(Scholarship)  ను అందించ‌నున్నారు. ఈ కుటుంబాల‌కు చెందిన విద్యార్థుల‌కు ఒకసారి ఆర్థిక సాయం రూపంలో రూ.15,000 నుంచి రూ.75,000 వ‌ర‌కు హెచ్‌డీఎఫ్‌సీ అందిస్తోంది. ఈ స్కాల‌ర్‌షిప్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 31, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

స్కాల‌ర్‌షిప్ వివ‌రాలు..
- 1 నుంచి 5 త‌ర‌గ‌తుల‌కు రూ. 15,000
- 6 నుంచి 8 త‌ర‌గ‌తుల‌కు రూ.25,000

- 9 నుంచి 12 త‌ర‌గ‌తుల‌కు రూ. 21,000
- డిప్ల‌మా కోర్సుల‌కు రూ. 20,000
- గ్రాడ్యుయేష‌న్ కోర్సులు (బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ త‌దిత‌ర‌) - రూ.30,000
- పోస్టు గ్రాడ్యుయేష‌న్ (ఎంకామ్‌, ఎంఏ త‌దిత‌ర‌) - రూ.35,000

- ప్రొఫెష‌న‌ల్ (బీటెక్‌, ఎంబీబీఎస్‌, ఎల్ఎల్‌బీ, బీఆర్కె, న‌ర్సింగ్ ) రూ. 50,000
- పోస్టు గ్రాడ్యుయేష‌న్ ( ఎంటెక్‌, ఎంబీఏ) కోర్సులు - రూ. 55,000 నుంచి రూ. 75,000
విద్యార్థుల త‌మ చ‌దువుకు ట్యూష‌న్ ఫీజు, ఇంట‌ర్నెట్ స‌దుపాయం కోసం, ఆన్‌లైన్ ల‌ర్నింగ్, స్టేష‌నరీల కోసం వినియోగించుకోవ‌చ్చ‌ని హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) పేర్కొంది. ఈ స్కాల‌ర్‌షిప్ విద్యార్థుల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పేర్కొంది.

స్కాల‌ర్‌షిప్ కోసం అందించాల్సి డాక్యుమెంట్స్‌
- 2019-2020 చ‌దివిన కోర్సుకు సంబంధించి డాక్యుమెంట్స్ (Documents) అంతే కాకుండా 2018-2019 సంవ‌త్స‌రానికి సంబంధించిన కోర్సు వివ‌రాలు కూడా స‌మ‌ర్పించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం సంవ‌త్స‌రం చ‌దివేందుకు అవ‌స‌ర‌మైన ర‌సీదు వివ‌రాలు అడ్మిష‌న్ స‌మాచారం అందించాలి.
- ఆధార్‌ (Aadhar)/ ఓట‌ర్ / పాన్ కార్డు / డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) ఏదో ఒక‌టి స‌మ‌ర్పించాలి.
- త‌ల్లిదండ్రుల్లో ఎవ‌రు మృతి చెందారో వారి డెత్ స‌ర్టిఫికెట్. అంతే కాకుండా జీవ‌నోపాధి కోల్పోయిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రం స‌ర్పించాలి.
- ద‌ర‌ఖాస్తు దారు లేదా త‌ల్లిదండ్రి బ్యాంక్ ఖాతా అందించాలి.

ద‌ర‌ఖాస్తు చేసే విధానం..

Step 1 :  ఈ స్కాల‌ర్‌షిప్‌కు కేవ‌లం ఆన్‌లైన్ (Online) ద్వారానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

Step 2 :  ముందుగా https://www.buddy4study.com/scholarships వెబ్‌సైట్‌లో రిజిస్ట‌ర్ చేసుకోవాలి.

Step 3 :  రిజిస్ట్రేష‌న్ (Registration) పూర్తి చేసిన త‌రువాత హెచ్‌డీఎఫ్‌సీ ప‌రివ‌ర్త‌న్ కోవిడ్ కోర్సుల లింక్‌లోకి వెళ్లాలి.

Step 4 :  హెచ్‌డీఎఫ్‌సీ ప‌రివ‌ర్త‌న్ కోవిడ్ కోర్సు లింక్
https://www.buddy4study.com/page/hdfc-bank-parivartans-covid-crisis-support-scholarship-program

Step 5 :  ద‌ర‌ఖాస్తు ఫాం పూర్తిగా నింపాలి.

Step 6 :  స్టార్ట్ బ‌ట‌న్ నొక్క‌డం ద్వారా అప్లికేష‌న్ ఫాం (Application Form) లో అడిగిన వివ‌రాలు అందించాలి.

Step 7 :  అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు పూర్తిగా అందించాలి.

Step 7 :  ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 31, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.