Federal Bank: మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా..? అయితే మీకో గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.5.70 లక్షలు సంపాదించే ఛాన్స్..!
Federal Bank: మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా? బ్యాంకులో ఇంటర్న్‌షిప్ ద్వారా వర్క్ ఎక్స్పీరియన్స్ పొందాలనేది మీ కలా? అయితే మీకు ఫెడరల్ బ్యాంకు (Federal Bank) ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా? బ్యాంకులో
ఇంటర్న్‌షిప్ ద్వారా వర్క్ ఎక్స్పీరియన్స్ పొందాలనేది మీ కలా? అయితే మీకు
ఫెడరల్ బ్యాంకు (Federal Bank) ఓ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రాడ్యుయేట్ల
కోసం తాజాగా రెండేళ్ల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ తీసుకువచ్చినట్లు
ప్రకటించింది. ప్రస్తుతం విద్యార్థుల నుంచి దరఖాస్తులను
ఆహ్వానిస్తున్నామని ఫెడరల్ బ్యాంకు తెలిపింది. ఈ ఇంటర్న్‌షిప్
ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులు ఫెడరల్ బ్యాంక్
మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MAHE) నుంచి పీజీ డిప్లొమా
అందుకోవచ్చు. అంతేకాదు, సంవత్సరానికి రూ. 5.70 లక్షల వరకు ఆదాయం
సంపాదించవచ్చు.
ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలనే ఆసక్తి గల అభ్యర్థులు
అక్టోబర్ 23 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ పరీక్షను
నవంబర్ 7న నిర్వహిస్తారు. ఫెడరల్ బ్యాంకు ఈ కోర్సును ‘ఫెడరల్ ఇంటర్న్‌షిప్
ప్రోగ్రామ్ (ఎఫ్‌ఐపీ)’ పేరుతో.. మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్
(ఎంఏజీఈ) తో కలిసి నిర్వహిస్తుంది.
* ఇంటర్న్‌షిప్ నేర్పించే అంశాలు ఏంటి?
ఈ
కోర్సు ఎంఏజీఈ (MAGE) ద్వారా వర్చువల్ సెషన్‌లతో పాటు ఫెడరల్ బ్యాంక్
శాఖలు/ఆఫీసుల వద్ద ఇంటర్న్‌షిప్ అందిస్తుంది. భౌతిక అభ్యాస విధానం
(physical mode of learning) ద్వారా ఇంటర్న్‌లు పూర్తిస్థాయిలో విషయాలను
తెలుసుకునేందుకు ఈ కోర్సు సహాయపడుతుంది. ఈ ప్రోగ్రామ్‌లో చేరిన అభ్యర్థి
సంవత్సరానికి రూ. 5.70 లక్షల వరకు సంపాదించవచ్చు.అలాగే ఈ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తయిన చేసిన ఇంటర్న్‌కు మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MAHE) నుంచి బ్యాంకింగ్ లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రదానం చేస్తారు. ఈ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత ఇంటర్న్ విద్యార్థులను ఫెడరల్ బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా తీసుకునే (absorption) అవకాశం ఉంది.
* ఫెడరల్ బ్యాంక్ ఇంటర్న్‌షిప్ అర్హతలు
ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థులు 10వ తరగతి, 12వ తరగతి, గ్రాడ్యుయేషన్ కోర్స్ లో కనీసం 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 01.10.2021 నాటికి 27 ఏళ్లు మించకూడదు. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గోవా, హర్యానా, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ లేదా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు https://www.federalbank.co.in/federal-internship-program లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
కామెంట్‌లు