26, అక్టోబర్ 2021, మంగళవారం

IBPS Clerk Recruitment 2021: తెలంగాణ, ఏపీలోని ప్రభుత్వ బ్యాంకుల్లో 720 క్లర్క్ ఉద్యోగాలు. 2021 అక్టోబర్ 27 లోగా అప్లై చేయాలి

IBPS Clerk Recruitment 2021 | ఐబీపీఎస్ దేశవ్యాప్తంగా 7855 క్లర్క్ పోస్టుల్ని (Bank Clerk Jobs) భర్తీ చేస్తోంది. అందులో 720 పోస్టులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ బ్యాంకులో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకోండి.

తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. దేశవ్యాప్తంగా 7855 క్లర్క్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే 720 పోస్టులున్నాయి. తెలంగాణలోని 333, ఆంధ్రప్రదేశ్‌లో 387 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2021 అక్టోబర్ 27 లోగా అప్లై చేయాలి. తెలంగాణలోని అభ్యర్థులు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ భాషల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని అభ్యర్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో ఎగ్జామ్ రాయొచ్చు. ఐబీపీఎస్ రిలీజ్ చేసిన జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏఏ బ్యాంకుల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకోండి.

IBPS Clerk Recruitment 2021: తెలంగాణలో క్లర్క్ పోస్టుల వివరాలు ఇవే...

మొత్తం ఖాళీలు333
బ్యాంక్ ఆఫ్ ఇండియా5
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర10
కెనెరా బ్యాంక్1
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా34
ఇండియన్ బ్యాంక్60
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్16
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్2
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా205

IBPS Clerk Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లోని క్లర్క్ పోస్టుల వివరాలు ఇవే...

మొత్తం ఖాళీలు387
బ్యాంక్ ఆఫ్ ఇండియా9
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర4
కెనెరా బ్యాంక్3
ఇండియన్ బ్యాంక్120
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్3
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా248

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఐబీపీఎస్ జూలైలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్‌లో ఈ పోస్టుల సంఖ్య తక్కువగా ఉండేది. తెలంగాణలో 263, ఆంధ్రప్రదేశ్‌లో 263 పోస్టుల భర్తీకి అప్పుడు నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పుడు పోస్టుల సంఖ్యను పెంచుతూ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది ఐబీపీఎస్.

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. అభ్యర్థులకు కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేట్ చేసే నైపుణ్యం ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి. అభ్యర్థులకు సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అధికార భాషలో నైపుణ్యం ఉండాలి. అంటే ఆ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి.

ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, తెలంగాణలోని హైదరాబాద్,కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.

కామెంట్‌లు లేవు: