Andhra Pradesh Jobs: అనంతరపురం ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌లో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (Andhra Pradesh State Housing Corporation Limited) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 30, 2021 వరకు అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి
చెందిన ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (Andhra Pradesh State
Housing Corporation Limited) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. నోటిఫికేషన్ ద్వారా ఐటీ మేనేజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ
చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు పూర్తిగా ఆఫ్‌లైన్ విధానంలో
ఉంటుంది. దరఖాస్తు చేసుకోనే వారి గరిష్ట వయసు సెప్టెంబర్ 30,
2021నాటికి 42 ఏళ్లుమించి ఉండకూడదు. దరఖాస్తుకు అక్టోబర్ 30, 2021
వరకు అవకాశం ఉంది. అభ్యర్థులను రాత పరీక్ష (Written Test) ద్వారా
ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ వివరాల కోసం అధికారికి
వెబ్‌సైట్ https://ananthapuramu.ap.gov.in/notice_category/recruitment/ ను సందర్శించాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు.. అర్హతలు
పోస్టు పేరు | అర్హతలు | ఖాళీలు | జీతం |
ఐటీ మేనేజర్ | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బీటెక్ లేదా ఎంసీఏ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరి | 01 | రూ.25,000 |
డేటా ఎంట్రీ ఆపరేటర్ | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో పీజీడీసీ/ బీకాం కంప్యూటర్స్ / ఎంసీఏ/ బీటెక్ / బీఎస్సీ కంప్యూటర్స్ చేసి ఉండాలి. | 05 | రూ.15,000 |
ఎంపిక విధానం..
- దరఖాస్తు చేసుకొన్న వారిని పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఈ పరీక్షను అనంతరపురంలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ వారు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.
Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://ananthapuramu.ap.gov.in/notice_category/recruitment/ ను సందర్శించాలి.
Step 3 : అనంతరం నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి అర్హత ఉన్న పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4 : నోటిఫికేషన్ చివరన అప్లికేషన్ ఫాం (Application Form) ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.
Step 5 : అప్లికేషన్ ఫాం పూర్తిగా నింపి దరఖాస్తుకు అవసరం అయిన డాక్యుమెంట్లను పొందుపరిచి పోస్ట్ పంపాలి.
- దరఖాస్తకు కావాల్సిన సర్టిఫికెట్లు
- పదోతరగతి సర్టిఫికెట్ ( 10th Certificate), డిగ్రీ తత్సమ అర్హత సర్టిఫికెట్
- స్టడీ అండ్ కాస్ట్ సర్టిఫికెట్
- అవసరమైన విభాగాలకు అనుభవం ధ్రువీకరణ పత్రం
Step 6 : దరఖాస్తు పంపాల్సి చిరునామా
ప్రాజెక్టు డైరెక్టర్,
ఏపీహెచ్‌సీఎల్, డీఆర్‌డీఏ కాంపౌండ్,
అనంతపురం
Step 7 : దరఖాస్తుకు చేసుకోవడానికి అక్టోబర్ 30, 2021 వరకు అవకాశం ఉంది.
కామెంట్‌లు