Alerts

Alerts from Blog Synchronized 40s Scrolling Alerts – Gemini Internet

25, అక్టోబర్ 2021, సోమవారం

India Post Jobs: ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్... హైదరాబాద్‌లో ఖాళీలు. డిసెంబర్ 15 చివరి తేదీ


India Post Jobs: ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్... హైదరాబాద్‌లో ఖాళీలు

India Post Recruitment 2021 | డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్‌కి చెందిన సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ (CEPT) పలు పోస్టుల భర్తీకి దరఖాస్

నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ (CEPT) సంస్థలో పలు కేటగిరీల్లో టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. హైదరాబాద్‌తో పాటు మైసూరు, చెన్నై, బెంగళూరులో ఉన్న సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ యూనిట్లలో ఈ పోస్టులున్నాయి. మొత్తం 29 పోస్టుల్ని ప్రకటించింది ఇండియా పోస్ట్. అసిస్టెంట్ మేనేజర్, టెక్నికల్ సూపర్‌వైజర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 డిసెంబర్ 15 చివరి తేదీ. ఈ పోస్టుల్ని డిప్యుటేషన్ ద్వారా ఎంపిక చేస్తోంది ఇండియా పోస్ట్. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

India Post Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...

మొత్తం ఖాళీలు29విద్యార్హతలు
అసిస్టెంట్ మేనేజర్23గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ పాస్ కావాలి. కంప్యూటర్ సైన్స్‌లో ఒక ఏడాది డిప్లొమా ఉండాలి.
టెక్నికల్ సూపర్‌వైజర్6గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ పాస్ కావాలి. కంప్యూటర్ సైన్స్‌లో ఒక ఏడాది డిప్లొమా ఉండాలి.

Gemini Internet

India Post Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తు ప్రారంభం- 2021 అక్టోబర్ 16
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 15
అనుభవం- అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సబార్డినేట్ ఆఫీసుల్లో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన రెండేళ్ల అనుభవం తప్పనిసరి. టెక్నికల్ సూపర్‌వైజర్ పోస్టుకు ఏడాది అనుభవం తప్పనిసరి.
వయస్సు- 56 ఏళ్ల లోపు
ఎంపిక విధానం- డిప్యూటేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
వేతనం- రూ.9,300 బేసిక్ వేతనంతో మొత్తం రూ.34,800 వేతనం లభిస్తుంది.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

India Post Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా

Step 1- అభ్యర్థులు ముందుగా https://ccc.cept.gov.in/technicalposts/ లింక్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో Register పైన క్లిక్ చేయాలి.
Step 3- రిజిస్ట్రేషన్ ఫామ్‌లో పేరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్ లాంటివి ఎంటర్ చేయాలి.
Step 4- రిజిస్ట్రేషన్ సక్సెస్ అయిన తర్వాత https://ccc.cept.gov.in/technicalposts/ మరోసారి ఓపెన్ చేయాలి.
Step 5- మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి వచ్చిన వివరాలతో లాగిన్ కావాలి.
Step 6- విద్యార్హతలు, ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
Step 7- ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
Step 8- Preview పైన క్లిక్ చేసి అప్లికేషన్ వివరాలు చెక్ చేసుకోవాలి.
Step 9- Submit పైన క్లిక్ చేసి దరఖాస్తు పామ్ సబ్మిట్ చేయాలి.
Step 10- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.

 

 

కామెంట్‌లు లేవు:

Recent

✅ *SSC GD Constable Correction/ Edit Form 2026* 👇

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...