20, అక్టోబర్ 2021, బుధవారం

Aadhaar Hackathon 2021: ఆధార్‌ హ్యాకథాన్‌ను నిర్వహించనున్న UIDAI... రూ.3,00,000 గెలుచుకోవచ్చు

Aadhaar Hackathon 2021 | యూఐడీఏఐ మొదటి ఆధార్ హ్యాకథాన్ నిర్వహిస్తోంది. ఈ హ్యాకథాన్‌లో పాల్గొన్నవారు రూ.3,00,000 వరకు ప్రైజ్ మనీ (Prize Money) గెలుచుకోవచ్చు. ఈ హ్యాకథాన్ థీమ్, పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఆధార్ కార్డులను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తొలిసారిగా హ్యాకథాన్ (ఎక్కువ మంది ప్రజలు ఏదైనా కంప్యూటర్ కార్యకలాపంలో పాల్గొనడం) ను నిర్వహించనుంది. 'ఆధార్ హ్యాకథాన్ 2021' (Aadhaar Hackathon) పేరుతో యువ ఆవిష్కర్తలను లక్ష్యంగా చేసుకొని వివిధ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్లకు చెందిన యువతను ఇందులో భాగం చేయనుంది. ఇది ఆధార్ టీమ్ తొలిసారిగా నిర్వహిస్తున్న కార్యక్రమం. అక్టోబరు 28 అర్ధరాత్రి నుంచి అక్టోబరు 31 వరకు ఈ హ్యాకథాన్ ను నిర్వహిస్తామని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

ఆధార్ హ్యాకథాన్ 2021 థీమ్

నమోదు, నవీకరణ (Enrolment and Update) అనే రెండు అంశాలపై ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రెండు థీమ్స్ ఉన్నాయి. 'ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్' మొదటి థీమ్‌ను యూఐడీఏఐ ఎంచుకుంది. ఇది నివాసితులు వారి చిరునామాను అప్డేట్ చేస్తున్నప్పుడు ఎదుర్కొంటున్న కొన్ని నిజ జీవిత సవాళ్లను కవర్ చేస్తుంది.

థీమ్ కింద ఆధార్ నంబర్ లేదా ఎలాంటి డెమోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకుండా గుర్తింపును నిరూపించడానికి యూఐడీఏఐ వినూత్న పరిష్కారాలను కోరుతుంది. అలాగే నూతనంగా ప్రారంభించిన ఫేస్ అథెంటికేషన్ అయిన.. APIకి సంబంధించిన అంశాలు సైతం ఇందులో భాగంగా ఉన్నాయి.

నివాసితులు వారి అవసరాలను పరిష్కరించుకోవడానికి ఇప్పటికే ఉన్నవాటితో పాటు నూతనంగా వచ్చిన ఏపీఐలో కొన్నింటిని పాపులర్ చేయాలనే లక్ష్యంతో UIDAI పనిచేస్తుంది. అధునాతన సాంకేతిక పరిష్కారాల ద్వారా ఈ సవాళ్లను అధిగమించడానికి ఈ సంస్థ ఇంజనీరింగ్ కళాశాలల యువతను కార్యక్రమంలో భాగం చేస్తోంది.

ఆధార్ హ్యాకథాన్ 2021 విజేతలు ప్రైజ్ మనీ

ప్రతి థీమ్ విజేతలకు ప్రైజ్ మనీతో పాటు ఇతర లాభదాయకమైన ప్రయోజనాలను UIDAI అందించనుంది. కొన్ని రివార్డులను కూడా ప్రకటించనుంది. ప్రతీ థీమ్‌లో మొదటి బహుమతి రూ.3,00,000, రెండో బహుమతి రూ.2,00,000, మూడో బహుమతి కింద రెండు టీమ్స్‌కు రూ.1,00,000 చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనుంది యూఐడీఏఐ.

ఎలా నమోదు చేసుకోవాలి

ఆధార్ హ్యాకథాన్ 2021 కోసం ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ ఫారంలు https://hackathon.uidai.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గలవారు వెబ్‌సైట్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని UIDAI ప్రకటించింది.


 

 

 

కామెంట్‌లు లేవు: